Begin typing your search above and press return to search.
బాబు ట్వీటు మీద ట్వీటు..బిల్ గేట్స్ స్పందిస్తే ఒట్టు
By: Tupaki Desk | 18 Nov 2017 5:09 PM GMTదేన్ని ఎలా ప్రచారం చేసుకోవాలో బాగా తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఏపీ అగ్రిటెక్ సదస్సు-2017కు బిల్ గేట్స్ రాక సందర్భంగా చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఫౌండేషన్ పనుల్లో బాగా బిజీగా ఉంటున్న గేట్స్ ఇండియా అంటే మంచి ఇంట్రెస్టు చూపిస్తున్నారు. తరచూ ఇండియా వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇండియా పర్యటనకు, పనిలో పనిగా విశాఖ సదస్సుకు వచ్చారు. బిల్ గేట్స్ కోసం ఎయిర్ పోర్టు వరకు వెళ్లి స్వాగతం పలికారు. ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు చంద్రబాబు వరుస ట్వీట్లతో హోరెత్తించారు. ఎప్పుడేం జరుగుతోందో లైవ్ అప్ డేట్స్ తో ఊదరగొట్టారు. కానీ... బిల్ గేట్స్ ట్విటర్ అకౌంట్లో మాత్రం ఈ పర్యటన గురించి ఒక్క ట్వీట్ కూడా లేదు.
‘థాంక్యూ మై ఫ్రెండ్ బిల్ గేట్స్’ అంటూ సంబోధిస్తూ ట్వీట్లతో చంద్రబాబు హోరెత్తించినా బిల్ గేట్స్ నుంచి మాత్రం ఈ కార్యక్రమం గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ, ఏపీ గురించి కానీ ఒక్క ట్వీట్ కూడా లేదు. పైగా చంద్రబాబు ట్వీట్లలో గేట్స్ ను ట్యాగ్ చేసినా కూడా గేట్స్ ట్విటర్ పేజీలో వాటిని రీట్వీట్ చేయలేదు.
దీంతో చంద్రబాబును విమర్శించేవారంతా సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వేస్తున్నారు. కొద్దిరోజుల కిందట గేట్స్ యూపీలో పర్యటించడం.. ఆ రాష్ర్ట సీఎం యోగిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా యోగి ఏమీ అత్యుత్సాహం చూపించలేదని... గేట్స్ కోసం ఎయిర్ పోర్టు వరకు ఎదురెల్లలేదని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎందుకో మరీ ఇంత అత్యుత్సాహం చూపించి అభాసుపాలవడం అంటూ సెటైర్లు వేస్తున్నారు.