Begin typing your search above and press return to search.
27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి .. గేట్స్ విడాకులకు జడ్జి ఆమోదం
By: Tupaki Desk | 3 Aug 2021 8:31 AM GMTమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సింగిల్ అయిపోయారు. ఆయన భార్య మెలిందా దరఖాస్తు చేసుకున్న విడాకులకు జడ్జి ఆమోదం తెలిపారు. వాషింగ్టన్ కౌంటీ కోర్టులో ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నారు. గత మే నెలలో తాము విడుపోతున్నట్లు ప్రకటించారు బిల్ గేట్స్, మెలిందా. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ , 27 ఏళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా బ్రేక్ పడింది. మెలిండా దరఖాస్తు చేసుకున్న విడాకులకు జడ్జి ఆమోదం తెలిపారు. విడాకుల పత్రంలో ఆర్థిక అంశాల గురించి కూడా ఎటువంటి ప్రస్తావన చేయలేదని తెలుస్తోంది. బిల్ గేట్స్ కు సుమారు 152 బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది.
అయితే డైవోర్స్ తర్వాత ఈ ఆస్తిని ఎలా పంచుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గేట్స్ ఫౌండేషన్ ను మాత్రం ఇద్దరూ కలిసి మరో రెండేళ్లపాటు నడపనున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఆధారంగా డైవర్స్ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఎవరు భరణం ఇచ్చే రీతిలో ఒప్పందం జరగలేదని కోర్టు డాక్యుమెంట్ల ద్వారా స్పష్టం అవుతున్నది. విడాకుల ఆమోద పత్రంలో ఆర్థిక అంశాల గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. బిల్ గేట్స్ ఆస్థి సుమారు 152 బిలియన్ల డాలర్లు. అయితే డైవర్స్ తర్వాత ఆ ఆస్తి ఒకవేళ ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే, అప్పుడు ఒక్కొక్కరి ఆస్థి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. పెళ్లి తరువాత కుటుంబం సంపాదించిన మొత్తం ఆస్తిని ఉమ్మడి ఆస్తిగా భావించాలని అమెరికా చట్టాలు చెబుతున్నాయి. విడాకులు తీసుకునే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఈ ఆస్తులను సమానంగా విభజించి పంచుకోవాలి. అయితే ఒక్కరికే చెందే కొన్ని ప్రత్యేక ఆస్తులు మాత్రం విభజించడానికి వీల్లేదు. వారసత్వ సంపదగా వచ్చిన ఆస్తులు విడాకుల తరువాత కూడా వారి పేరుమీదే ఉంటాయి.
వీరి విడాకుల నిర్ణయానికి గల కారణాలపై అనేక వదంతులు వినిపించాయి. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని.. రెండేళ్ల క్రితం నుంచే విడాకుల కోసం మెలిందా ప్రయత్నాలు మొదలు పెట్టారని.. వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. 2019లోనే లాయర్లను సంప్రదించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను కూడా ఆ పత్రిక సేకరించింది. లైంగిక నేరాభియోగాలు, ఎప్ స్టెయిన్ బేగన్ తో సత్సంబంధాలు కూడా మెలిందా, బిల్ గేట్స్ విడిపోవడానికి కారణాలుగా కూడా ప్రచారం జరిగింది. 1994లో వీరి వివాహం జరిగింది. 27 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. 2000 సంవత్సరంలో బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించారు. పలు ధార్మిక కార్యక్రమాలకు 53 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. బిల్ గేట్స్ వయసు 65 ఏళ్లు. మెలిండా వయసు 56 ఏళ్లు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ బాధ్యతల నుంచి 2008లో తప్పుకున్న బిల్ గేట్స్.. ధార్మిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రకటించారు. తర్వాత బోర్డు సభ్యత్వం నుంచి వైదొలగిన గేట్స్.. కేవలం టెక్నాలజీ ఎడ్వైజర్ గానే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ మలేరియా సహా పలు ప్రాణాంతక వ్యాధులు, వ్యవసాయ పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలకు నిధులు సమకూర్చుతూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కరోనా వైరస్ పై పోరాటానికి మిలియన్ డాలర్ల సాయం అందించారు. అంతేకాదు, కోవిడ్ వంటి మహమ్మారి గురించి 2015లోనే గేట్స్ హెచ్చరించారు.