Begin typing your search above and press return to search.

విడాకుల నిర్ణయం తప్పే .. నోరువిప్పిన బిల్ గేట్స్ , అయితే ..!

By:  Tupaki Desk   |   15 July 2021 11:30 AM GMT
విడాకుల నిర్ణయం తప్పే .. నోరువిప్పిన బిల్ గేట్స్ , అయితే ..!
X
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ఇన్నేళ్ల కాపురం తర్వాత తాము ఇక విడిపోతామని గత మే 4 న వీరిద్దరూ ప్రకటించారు. కాగా తమ బ్రేకప్ పై బిల్ గేట్స్ ఇన్ని రోజులకి మొదటిసారి నోరు విప్పారు.

గతవారం జరిగిన 'సమ్మర్ క్యాంప్ ఫర్ బిలియనీర్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. మెలిండాతో డైవోర్స్ వ్యవహారం, ఇక మీ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన డైవోర్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తప్పే అని చెప్పుకొచ్చారు.

అయితే, మరో మహిళతో తనది ఎఫైర్ అన్నదాన్ని ఒప్పుకోనని, అసలు ఆ పదమే సరికాదని స్పష్టం చేశారు. తన సహోద్యోగితో ఆయన రాసలీలలు జరిపాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడో 2000 సంవత్సరంలోనిదని కూడా ఈ వార్తలు వెల్లడించాయి. నిజానికి ఏడాది కాలంగా బిల్ గేట్స్, మెలిండా వేర్వేరుగా ఉంటున్నారు. 2019 నుంచే తన భర్తను ఆమె దూరం పెడుతూ వచ్చిందట.

అప్పటి నుంచే విడాకుల విషయమై తన లాయర్లతో ఆమె సంప్రదిస్తూ వచ్చినట్టు తెలిసింది. తన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగితో బిల్ గేట్స్ కి సంబంధాలు ఉన్నాయని ఆమె అనుమానిస్తూ వచ్చింది. 2013 నుంచే ఆమెలో ఈ సందేహాలు మొదలయ్యాయట.

ఇక వీరి ధార్మిక సంస్థ బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్ వ్యవహారానికే వస్తే తన భార్యకు ఈయన విడాకులు ఇచ్చిన తక్షణం మెలిండా ఈ సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. భార్యాభర్తలుగా విడిపోయినా స్వచ్ఛంద సంస్థ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది.. కొత్త జీవితంలో వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని బిల్‌, మిలిండాలు ప్రకటించారు.