Begin typing your search above and press return to search.
ఇండియాపై బిల్‌గేట్స్ పొగడ్తల వర్షం.. కారణం అదేనా!
By: Tupaki Desk | 16 Sep 2020 2:30 AM GMTఇండియాపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పొగడ్తల వర్షం కురిపించాడు. వ్యాక్సిన్ తయారీలో భారత్ సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కాగానే వ్యాక్సిన్లు తుది ప్రయోగదశకు చేరుకుంటాయని చెప్పారు. ఇండియాలో భారీ మొత్తంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో ఫార్మారంగం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రపంచ దేశాలకు సరిపడా అక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. బిల్‌గేట్స్ ప్రస్తుతం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. వ్యాక్సిన్ సురక్షితం అని తేలిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావాలన్నది తన అభిప్రాయమని చెప్పారు.
భారత్‌లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ ప్రపంచంలోని ఎన్నోదేశాలకు సరఫరా కానున్నదని చెప్పారు. తొందర్లోనే కరోనా పీడ విరగడై ప్రపంచ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38 వ్యాక్సిన్లు మానవ ప్రయోగదశలో ఉన్నాయని... మరో 93 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని చెప్పారు. కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. రష్యా ఇప్పటికే స్పుత్నిక్-వీ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. నవంబర్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు చైనా కూడా వ్యాక్సిన్ తయారీలో ముందజలో ఉన్నది.