Begin typing your search above and press return to search.

ఆర్థిక సంక్షోభంలో పెద్ద‌న్న‌!.. ఇది గేట్స్ మాట‌

By:  Tupaki Desk   |   3 March 2018 7:19 AM GMT
ఆర్థిక సంక్షోభంలో పెద్ద‌న్న‌!.. ఇది గేట్స్ మాట‌
X
ప్ర‌పంచానికి పెద్ద‌న్న అంటూ అంద‌రూ అభివ‌ర్ణించే అగ్ర‌రాజ్యానికి సంబంధించి ఒక షాకింగ్ అంచ‌నాను వెల్ల‌డించారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌. అమెరికాకు ఆర్థిక సంక్షోభం అంటే.. ప్ర‌పంచానికి కూడా త‌ల‌నొప్పే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అగ్ర‌రాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్ర‌తిసారీ.. ఆ ప్ర‌భావం ప్రపంచం మీద ప‌డ‌టం.. భార‌త్ లాంటి వ‌ర్థ‌మాన దేశాల మీద ప్ర‌భావం అధికంగా ఉండ‌టం గ‌త అనుభ‌వాలు ఇప్ప‌టికే ప‌లుమార్లు రుజువు చేశాయి.

తాజాగా అస్క్ మి ఎనీథింగ్ (న‌న్ను ఏదైనా అడ‌గండి) అంటూ ఏ అంశం మీద‌నైనా అడ‌గొచ్చొంటూ అన్న దానికి ఒక యూజ‌ర్ ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను సంధించారు. 2008లో అమెరికాను ఇబ్బంది పెట్టిన ఆర్థిక సంక్షోభం త‌ర‌హాలో అలాంటిదే మ‌రోసారి స‌మీప భ‌విష్య‌త్తులో త‌లెత్తే అవ‌కాశం ఉందా? అని ప్ర‌శ్నించారు.

దీనికి గేట్స్ బ‌దులిస్తూ.. అవున‌ని చెప్పారు. అవున‌ని చెప్ప‌టం క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌హా సంక్షోభం త‌లెత్త‌టం త‌థ్య‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు. 2008లో అమెరికాను వెంటాడిన ఆర్థిక సంక్షోభ స‌మ‌యంలో దాదాపు 88 ల‌క్ష‌ల ఉద్యోగాలు అమెరిక‌న్లు కోల్పోయారు. నిక‌ర సంప‌ద దాదాపు 19 ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు హ‌రించుకుపోయిన‌ట్లుగా చెబుతారు.

ఈ ప్ర‌భావం ప్ర‌పంచం మీద ప‌డ‌ట‌మే కాదు.. భార‌త్ లోని ఐటీ ఉద్యోగాల మీద ప‌డింది. మ‌రి.. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం లేదా? అంటే.. ఇన్నోవేష‌న్.. క్యాపిట‌లిజం మ‌రింత మెరుగైతే దాని నుంచి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి.. అమెరికా ఆర్థికవేత్త‌లు గేట్స్ అంచ‌నాల‌పై ఏమంటారో?