Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ సంచలనం.. విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి మాట.. ఆమె ఎవరంటే?

By:  Tupaki Desk   |   3 May 2022 4:51 AM GMT
బిల్ గేట్స్ సంచలనం.. విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి మాట.. ఆమె ఎవరంటే?
X
కలిసి కాపురం చేస్తున్న భార్యభర్తలు అనూహ్యంగా విడాకులు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. సగటుజీవులు మొదలు కొని సెలబ్రిటీల వరకు విడాకులు తీసుకుంటున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాలంలో వెలుగు చూసిన విడాకుల కేసుల్లో యావత్ ప్రపంచం మొత్తం మాట్లాడుకున్న విడాకుల కేసుల్లో ముఖ్యమైనది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దంపతులది.

అత్యంత అన్యోన్య జంటగా అందరూ భావించే బిల్ గేట్స్ దంపతులు.. విడాకులు తీసుకోవటం.. మూడు దశాబ్దాల వారి దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకోవటానికి నిర్ణయం తీసుకోవటం చాలామందిని జీర్ణించుకులేని విధంగా మారింది.

తాజాగా బిల్ గేట్స్ ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విడాకులు.. పెళ్లికి సంబంధించిన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన మనసులోని మాటను ఆయన చెప్పుకొచ్చారు.

తన మాజీ భార్య మెలిందాతో తన పెళ్లి చాలా గొప్పదని.. మళ్లీ అవకాశం వస్తే ఆమెనే పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. రెండేళ్లలో తన జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని.. పిల్లలు పెరిగి పెద్దవారై.. తమను విడిచి వెళ్లిన తర్వాత వివాహ బంధంలో మార్పు చోటు చేసుకుందన్నారు. ‘నా జీవితంలో చోటు చేసుకున్న మార్పు.. విడాకులు.

నావరకు మా వివాహం గొప్పది. జరిగిన దానిని నేను మార్చలేను. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. అవకాశం లభిస్తే మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవటం గురించే ఆలోచిస్తున్నాను’’ అని చెప్పిన మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతానికి తనకు ఫ్యూచర్ ఆలోచనలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని.. ఇప్పటికి తాను మెలిందాతో కలిసి పని చేయటాన్ని లక్ గా భావిస్తున్నట్లు చెప్పారు. తనతో ఇప్పటికీ స్నేహంగా ఉన్నానని.. తమ మధ్య సన్నిహితమైన సంబంధం ఉందన్నారు. తాము ఫౌండేషన్ ను కలిసి ప్రారంభించామని చెప్పుకొచ్చారు. మరి.. బిల్ గేట్స్ కోరుకున్నట్లే ఆయన వైవాహిక బంధం ఉండనుందా? అన్నది కాలమే తేల్చాలి.