Begin typing your search above and press return to search.
కరోనా విజృంభణకి ట్రంపే కారణం .. బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 21 Sep 2020 2:30 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. ఇక, అగ్రరాజ్యం అమెరికా షేక్ అయిపోయింది. మొదట్లో, ఈ కరోనా మహమ్మారి ధాటికి భయపడ్డప్పటికీ, క్రమంగా ప్రజలు కూడా అలవాటు పడుతున్నారు. అయితే, పూర్తి స్థాయిలో ఈ మహమ్మారి సోకితే చికిత్స అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనితో, కరోనా మరణాలు అధికంగానే ఉంటున్నాయి.
అగ్రరాజ్యం అమెరికానే ఈ మహమ్మారి ధాటికి తేరుకోలేకపోతోంది. అయితే, అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ పై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా మహమ్మారి విస్తరించడానికి ట్రంపే కారణం అని అన్నారు. కరోనాని కట్టడి చేయడానికి ప్రయాణాలను నిలిపేశారని, ఆ నిర్ణయమే ఇంతటి విజృంభణకు దారి తీసిందని అన్నారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు కూడా సొంత దేశానికి చేరుకున్నారని, వీరికి ఎలాంటి టెస్ట్ లు చేయలేదని, కనీసం క్వారంటైన్ లో కూడా ఉంచకపోవడంతో వ్యాధి విస్తరించిందన్నారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికాకు చేరుకున్నారని, వారికి కరోనా టెస్టులు చేయలేదని, వారిని కనీసం క్వారెంటైన్ కేంద్రాలకు కూడా తరలించలేదని బిల్‌గేట్స్ ఆరోపించారు.