Begin typing your search above and press return to search.

త్వరలో మరో కొత్త మహమ్మారి.. బిల్ గేట్స్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   21 Feb 2022 11:33 AM GMT
త్వరలో మరో కొత్త మహమ్మారి.. బిల్ గేట్స్ సంచలన కామెంట్స్
X
కరోనా మహమ్మారి దాదాపు మూడేళ్ల నుంచి కరాళ నృత్యం చేస్తోంది. దశల వారీగా పంజా విసురుతోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. గతేడాది చివరి నెలలో విజృంభించిన కరోనా జనవరి మూడో వారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జనం కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ ఉండదని ఇప్పటికే చాలా మంది వైద్య నిపుణులు చెప్పారు. అంతే కాకుండా థర్డ్ వేవ్ ప్రభావం కూడా... ఊహించిన దాని కన్నా చాలా తక్కువగా ఉంది. వైరస్ అంటే జనానికి భయం వీడింది. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు సంచలన కామెంట్స్ చేశారు. మరో మహమ్మారి రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు.

కరోనా మహమ్మారిపై బిల్ గేట్స్ మొదటి నుంచి హెచ్చరిక, సూచనలు, సలహాలను జారీ చేస్తూ వస్తున్నారు. ఇక ప్రజలంతా వైరస్ తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధారణ జీవితం గడవచ్చునని అనుకుంటున్నారు. ప్రముఖ ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కుదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో కొత్త పాండమిక్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే అది కరోనా నుంచి ఉద్భవించింది కాదని... వేరే వ్యాధికారక వైరస్ అని హెచ్చరించారు.

రాబోయే కొత్త వైరస్ దీర్ఘకాలిక రోగుల పై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారు, వయసు పైబడిన వారు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచం పై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాలపై ఈ ప్రభావం పడిందని అన్నారు. ఇప్పుడిప్పుడే అన్ని కుదుట పడుతున్నాయని వివరించారు. అంతేకాకుండా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ను చాలా సులభంగా ఎదుర్కొగలిగారని... కొత్త వైరస్ ను కూడా అంతే సులభంగా కట్టడి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు.

దేశంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల తోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని బిల్ గేట్స్ అన్నారు. అంతేకాకుండా వైద్య రంగంలో వచ్చిన ఆధునిక పద్ధతులు, సాంకేతిక వినియోగం రోగకారక వైరస్ లను అదుపులో పెడుతాయని పేర్కొన్నారు. టీకాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి... ఇతర వ్యాధులను కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఉందని వివరించారు. ఈ ఏడాది అర్ధ సంవత్సరం వరకు 70 శాతం టీకా ప్రక్రియ పూర్తి చేయడం కష్టమేనని... ఇప్పటివరకు 61.9 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు. అయితే కొత్త మహమ్మారి విజృంభించిన కూడా.. దానిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉందని అన్నారు. ఆ మహమ్మారి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చునని అభిప్రాయపడ్డారు.