Begin typing your search above and press return to search.
బిల్ గేట్స్ భార్యకు తక్షణం రూ.15000 కోట్ల ఆస్తి
By: Tupaki Desk | 6 May 2021 3:30 PM GMTచేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలి.. విడిపోతే కూడా మునిమనవళ్లు బతికేంత ఆస్తి సొంతమవుతుంది. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆయన భార్య మెలిండాకు విడాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తిలో సగం వాటా మెలిండాకు పోతుంది. ప్రపంచంలోని అత్యంత రోల్ మోడల్ జంటలలో ఒకరైన బిల్ గేట్స్ మ-మెలిండా ఫ్రెంచ్ గేట్స్ చట్టబద్ధంగా ఒకరి నుండి ఒకరు విడిపోతున్నారు. దంపతుల సామూహిక ఆస్తి నుంచి మెలిండా తీసుకునే వాటా ఒక పెద్ద మొత్తమే కావడం విశేషం. ఇది ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకుల పరిష్కారం అని చెప్పొచ్చు.
27 సంవత్సరాల సుధీర్ఘ వివాహ ప్రయాణానికి బిల్ గేట్స్ -మెలిండా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటివరకు మెలిండా గేట్స్ కోకాకోలా ఫెమ్సా మరియు గ్రూపో టెలివిసా వంటి సంస్థల్లో వాటా కలిగి ఉన్నారు. కెనడియన్ నేషనల్ రైల్వే కో మరియు ఆటోనేషన్ ఇంక్లలో కూడా ఆమె వాటాలను పొందింది. అన్నింటిని కలిపి ఆమె రూ.15,000 కోట్ల విలువైన స్టాక్ ను పొందింది. ఇది ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం మాత్రమే. ఈ ఒక్క మొత్తంతోనే మెలిండా స్థిరపడినట్లు కనిపిస్తోంది.
బిల్, మెలిండా దంపతులు ‘గేట్స్ ఫౌండేషన్’ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా సేవలందించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలు -లింగ సమానత్వం కోసం సంవత్సరాల్లో 3 లక్షల 75 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం బిల్ గేట్స్ ఆస్తి విలువ 11 లక్షల కోట్లకు పైగానే ఉంది. ఈ జంట దాదాపు 3 దశాబ్దాలుగా వైవాహిక బంధంలో కలిసి నివసిస్తున్నారు. వాషింగ్టన్లోని మదీనాలో అత్యంత ఖరీదైన 66,000 చదరపు అడుగుల భవనంలో వీరు ఉంటున్నారు.