Begin typing your search above and press return to search.

రేపిస్ట్‌ల‌కు దిమ్మ తిరిగే షాక్‌..స‌భ‌లో ఉరి బిల్లు!

By:  Tupaki Desk   |   24 July 2018 5:03 AM GMT
రేపిస్ట్‌ల‌కు దిమ్మ తిరిగే షాక్‌..స‌భ‌లో ఉరి బిల్లు!
X
గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఇటీవ‌ల కాలంలో అత్యాచారాలు అంత‌కంత‌కూ ఎక్కువైపోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముస‌లి.. ముత‌కా.. త‌ర త‌మ భేదం లేకుండా సాగుతున్న రేప్ ల నేప‌థ్యంలో దేశం ప‌రువు ప్ర‌తిష్ఠ‌లు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్నాయి. ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఉన్న కొద్దిపాటి గౌర‌వం కూడా మంట క‌లిసి పోతోంది. దేశంలో ఇటీవ‌ల కాలంలో పెరిగిపోతున్న అత్యాచార ఉదంతాల నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు ఈ మ‌ధ్య‌న ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

ప‌న్నెండేళ్ల బాలిక‌ల్ని రేప్ చేస్తే ఉరి విధించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. తాజాగా ఇదే అంశాల‌తో బిల్లును లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. క‌తువా.. ఉన్నావ్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్ర‌వేశ పెట్టారు.

దీని ప్ర‌కారం.. పన్నెండేళ్ల లోపు చిన్నారుల‌పై అత్యాచారాలు జ‌రిపిన వారికి మ‌ర‌ణ‌శిక్ష‌.. 16 ఏళ్ల లోపు బాలిక‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డిన వారికి 20 ఏళ్ల జైలుశిక్ష‌.. మ‌హిళ‌ల‌ను రేప్ చేస్తే ఏడేళ్ల నుంచి గ‌రిష్ఠంగా జీవిత‌ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు. అంతేకాదు.. రేప్ నేర‌స్తులు చ‌నిపోయే వ‌ర‌కూ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. వీట‌న్నింటికి మించి రేప్ కేసుల్ని రెండునెల‌ల్లో తేల్చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌.. కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు కోరితే.. దాన్ని తేల్చేందుకు ఆర్నెల్ల గ‌డువు ఇవ్వాల‌న్న అంశాల‌తో బిల్లును త‌యారు చేశారు.