Begin typing your search above and press return to search.
ప్రపంచ దేశాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. బిలిగేట్స్ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 22 Dec 2021 11:30 AM GMTకరోనా మహమ్మారి... వివిధ దశల్లో రూపాంతరం చెందుతూ విజృంభిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ తో విలయతాండవం చేసిన వైరస్... ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ అతి ప్రమాదకరం.. అందుకే రెండో దశలో ఎంతో మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. ఇకపోతే దానికంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ కొత్త వేరియంట్ కు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పై టెక్ మేధావి బిలిగేట్స్ సంచలన కామెంట్స్ చేశారు.
ఒమిక్రాన్ వల్ల ప్రపంచం అతి దారుణమైన దశకు చేరుకుందని టెక్ దిగ్గజం బిల్గేట్స్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షోభాలను ఎదుర్కొంటుందని అంచనా వేశారు. అన్ని రంగాలపై ఈ ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. డెల్టా తీవ్రతే అధికంగా ఉంటే... ఒమిక్రాన్ తీవ్రత అంతకుమించి ఉండే అవకాశం ఉందని బిల్గేట్స్ ట్వీట్ చేశారు. వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాను సెలవుల్ని చాలా ఎంజాయ్ చేయాలనుకున్నానని... ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేసుకున్నట్లు చెప్పారు. కానీ తన మిత్రులు కూడా ఒమిక్రాన్ బారిన పడ్డారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫలితంగా ఆ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే మునుపెన్నడూ ఏ వైరస్ ఇంతవేగంగా వ్యాప్తి చెందలేదని... ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తోందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
ఒమిక్రాన్ ప్రభావం రాబోయే రోజుల్లో... అన్ని దేశాలపై పడుతుందని చెప్పారు. అతిత్వరలో కేసుల్లో పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. రాబోయే మూడు నెలలు చాలా గడ్డుకాలమని ఆయన అన్నారు. ఆ ప్రభావం వచ్చే ఏడాదంతా ఉంటుందని అంచనా వేశారు. అయితే సరైన నిర్ణయాలు తీసుకుంటూ... తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ కరోనాను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా అయితే 2022లోనే మహమ్మారిని పారదోలవచ్చునని ట్వీట్ చేశారు. ఈ మేరక్ ఒమిక్రాన్ ఎఫెక్టుపై వరుస ట్వీట్లను ఆయన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తు చేసిన ఆయన... బూస్టర్ డోసు తీసుకోవాలంటూ ట్విటర్ వేదికంగా సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ... టీకా తీసుకుంటే వైరస్ ను కట్టడి చేయవచ్చునని చెప్పారు. అయితే బూస్టర్ డోసుపై ఆయన చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.