Begin typing your search above and press return to search.
పెరిగిపోతున్న కోటీశ్వరుల కుటుంబాలు
By: Tupaki Desk | 17 March 2021 9:40 AM GMTమనదేశంలో కోటీశ్వరుల కుటుంబాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఐశ్వర్యవంతులు పెరిగిపోతుంటే మరోవైపు పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. మనదేశంలో కోటీశ్వరుల సంఖ్యపై తాజాగా హురూన్ ఇండియా వెల్త్ రిపోర్టు 2020 ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం మినిమం 7 కోట్ల రూపాయల సంపద కలిగున్న కుటుంబాల సంఖ్య 4.12 లక్షలున్నాయట.
అంతేకాకుండా ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం ఇండియాలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నారట. ఇందులో కూడా మహారాష్ట్రలో అత్యధికులు ఉన్నట్లు సర్వే రిపోర్టు బయటపెట్టింది. మహారాష్ట్రలో డాలర్ మిలియనీర్ కుటుంబాలు 56 వేలున్నట్లు తేలింది. ఇందులో కూడా 16,993 కుటుంబాలు ముంబాయ్ లోనే ఉంటున్నారట.
ఇక దేశరాజధాని ఢిల్లీలో 16 వేల కుటుంబాలు - కోల్ కత్తాలో 10 వేల కుటుంబాలు నివశిస్తున్నాయట. బెంగుళూరులో 7500 కుటుంబాలు - చెన్నైలో 4700 కుటుంబాలున్నాయి. ఈ జాబితాలో రెండు తెలుగురాష్ట్రాలకు కూడా చోటు లభించింది లేండి. అయితే సంఖ్య మాత్రం తెలియలేదు.
ఈ నివేదికలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా వెల్లడైంది. అదేమిటంటే ఏడాదికి రూ. 20 లక్షలు పొదుపు చేస్తున్న కుటుంబాలు దేశంలో 6.33 లక్షలున్నాయట. ఒక వైపేమో సంపాదిస్తున్నదంతా ఖర్చు పెట్టేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోందంటు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి దీనికి భిన్నంగా రూ. 20 లక్షల పొదుపు చేస్తున్న కుటుంబాల సంఖ్య కూడా లక్షల్లోనే ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది.