Begin typing your search above and press return to search.
ఎవర్ గివెన్ కు బిలియన్ డాలర్ల జరిమానా
By: Tupaki Desk | 14 April 2021 8:30 AM GMTసూయజ్ కెనాల్ లో గతవారం ఇరుక్కుపోయి ప్రపంచవాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పింది.
ప్రపంచవాణిజ్యానికి కీలకమార్గమైన ఈజిప్టులోని సూయజ్ కాలువలో గతనెల 23న భారీ రవాణా నౌక ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల రోజుల తరబడి ప్రపంచవాణిజ్యం స్తంభించింది. దాదాపు వారం రోజులు కష్టపడి ఈ నౌకను పక్కకు తెచ్చారు. అయితే ఈ నౌకను విడిపించేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. తాజాగా అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.
400 మీటర్ల పొడవు, యాభై తొమ్మిది మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతిభారీ నౌక సూయజ్ కాలువకు అడ్డంగా తిరగడంతో ప్రయాణాలు ముందుకు సాగట్లేదు. ఎక్కడి నౌకలు అక్కడే ఆగిపోయాయి. మొత్తంగా 369 నౌకలు నిలిచిపోయినట్లుగా అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రతిరోజు 9 బిలియన్ డాలర్లు (రూ.65,205 కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం దాదాపు 19,120 కోట్ల టన్నుల సరుకు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుందని అంచనా. ప్రతిరోజూ 10 లక్షల బ్యారెల్స్ చమురు ఈ దారిలోనే వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. ఆ విధంగా.. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే సాగుతుందని అంచనా.
అందుకే ఎవర్ గివెన్ వల్ల జరిగిన నష్టంతో బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఈజిప్ట్ దేశం పట్టుబడుతున్నారు. కాలువ నుంచి విజయవంతంగా తొలగించిన తరువాత ఎవర్ గివెన్ కార్గో నౌకను ఈజిప్ట్ అధికారులు గ్రేట్ బిట్టర్ లేక్ కు తరలించి అక్కడ ఉంచారు.