Begin typing your search above and press return to search.
అవును నిజమే.. నవాజ్ షరీఫ్ కు లాడెన్ డబ్బులు ఇచ్చేవాడుః పాక్ మాజీ మంత్రి
By: Tupaki Desk | 1 Feb 2021 11:30 PM GMTఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు తరచూ డబ్బులు ఇచ్చే వాడని నవాజ్ షరీఫ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సయీదా అబిదా హుస్సేన్ బయట పెట్టారు. పలు విషయాల్లో ఒసామాకు షరీఫ్ అండగా ఉండేవారని అబిదా హుస్సేన్ వెల్లడించారు. భుట్టో సర్కారును కూల్చేందుకు లాడెన్ నుంచి షరీఫ్ డబ్బులు తీసుకున్నారని పాక్ ఎంపీ ఫారూఖ్ హబిబ్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా.. అబిదా హుస్సేన్ కూడా అదే ఆరోపణ చేయడం గమనార్హం.
సయీదా అబిదా హుస్సేన్ అమెరికాలో పాక్ రాయబారిగా కూడా పనిచేశారు. ఆయన ఇటీవల ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’ అని స్పష్టం చేశారు. బిన్ లాడెన్ ఒకప్పుడు చాలా పాపులర్ వ్యక్తి అని, అందరూ ఆయనను ఇష్టపడేవారని, అమెరికన్లు కూడా మొదట్లో ఆయనను ఇష్టపడేవారని హుస్సేన్ చెప్పారు. అయితే.. తర్వాతి కాలంలో ఆయనను ఒక అపరిచితుడిగా చూడడం మొదలు పెట్టారని అబిదా అన్నారు.
పాకిస్తాన్ కు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్.. కశ్మీర్ లో జీహాద్ ను పెంచేందుకు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించేందుకు బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చాలానే ఉన్నాయి. లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ డబ్బులు తీసుకున్నారని ఆ దేశ సీక్రెట్ ఏజెంట్ సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 2016లో రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ఖలీద్ ఖవాజా: షాహీద్-ఐ-అమాన్’అనే పుస్తకంలో బెనజీర్ భుట్టో కుటుంబ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలనే లక్ష్యంతో నవాజ్ డబ్బులు తీసుకున్న విషయాన్ని కూలంకశంగా వివరించారు.
పీటీఐ(Pakistan Tehreek-e-Insaf)ఎంపీ ఫారూఖ్ హబిబ్ కూడా కొద్ది రోజుల కిత్రం సంచలన ఆరోపణలు చేశారు. అవిశ్వాస తీర్మానం ద్వారా బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిన్ లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్.. 10 మిలియన్ డాలర్లు తీసుకున్నారని ఆరోపించారు. తాజాగా.. షరీఫ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అబిదా హుస్సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి.
బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ టీం 2011 మే నెలలో పాకిస్తాన్ లోనే హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో.. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పాక్ నేతలే ఈ తరహా ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. కాగా.. 2017లో అవినీతి కేసుల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన నవాజ్ ఫరీష్.. ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్నారు.