Begin typing your search above and press return to search.
మోడీ సర్కార్ మిస్ అయిన పాయింట్ ట్వీట్ తో చెప్పిన బయోకాన్ చీఫ్
By: Tupaki Desk | 9 April 2021 6:30 AM GMTఎవరెన్ని చెప్పినా.. దేశ పాలకులు ఒక విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోరు. దేశంలో పన్ను చెల్లింపుదారుల విషయంలో చోటు చేసుకునే నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ఇంట్లోని పిల్లలు ఎంతమంది ఉన్నా.. తల్లిదండ్రుల కష్టానికి అండగా నిలిచేది మాత్రం.. సంపాదించే పిల్లలే. ఈ విషయంలో మరో మాటకు తావు ఉండదు. అలాంటప్పుడు ఒక దేశానికి అవసరమైన ఆదాయ వనరుల్ని అందించే విషయంలో పన్ను చెల్లింపుదారులు ఎంతో కీలకం. అలాంటప్పుడు వారి సంక్షేమం గురించి ఆలోచించటం తప్పేముంది? ఆకలితో నకనకలాడే పేద వారి గురించి పాలకులు పథకాలు తీసుకొచ్చినప్పుడు.. తమ కష్టంతో భారీగా సంపాదించే వారు.. పన్నుల రూపంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తుంటారు.
దేశీయంగా చూస్తే.. మూడు కోట్ల మంది ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వారిలో కొందరు.. భారీగా పన్నుల్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. అలాంటి వారికి ఏ విషయంలోనూ పెద్ద పీట ఉండదు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అయినా వారికి అంతో ఇంతో ప్రాధాన్యత ఇవ్వాలి కదా? ఎందుకంటే.. సంక్లిష్ట పరిస్థితుల్లో వారు తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటారు. పాలకులకు పట్టని ఈ పాయింట్ ను బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
ఆదాయపన్ను చెల్లింపుదారులకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా వారు 3 కోట్ల మంది ఉన్నారు. వారు చచ్చిపోతే.. దేశం ఎలా బతుకుతుంది? అంటూ సూటిగా సంధించిన ట్వీట్ అస్త్రం సంచలనంగా మారటమే కాదు.. తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది. ఎప్పటిలానే ఆమె లేవెనెత్తిన పాయింట్ వివాదంగా మారటంతో పాటు.. ఆమెను తప్పు పట్టే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో.. ఆమెకు మద్దతుగా గళం విప్పే వారు ఉన్నారు. ఏమనుకున్నారో ఏమో కానీ.. హాట్ చర్చకు తెర తీసిన తన ట్వీట్ ను ఆమె డిలీట్ చేశారు.
మరో ట్వీట్ లో ‘‘మనలో సెన్సాఫ్ హ్యుమర్ తగ్గింది. అందుకే నా ట్వీట్ ను డిలీట్ చేస్తున్నా. నేను ప్రస్తావించిన విషయానికి అందరూ అంత సీరియస్ ఎందుకు అవుతున్నారు. ఆదాయపన్నుచెల్లింపుదారుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని సీరియస్ గానే సూచన చేస్తున్నా’’ అని మరో ట్వీట్ లో వెల్లడించారు. నిజమే.. కరోనా వారియర్స్ అంటూ కొన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వ్యవహరించే వారి విషయంలో ప్రభుత్వం.. వ్యాక్సిన్ విషయంలో ప్రాధాన్యత ఇవ్వటం తప్పేం కాదు కదా?