Begin typing your search above and press return to search.
ఎంత సింఫుల్ గా మోడీని అంత మాట అనేసిందో?
By: Tupaki Desk | 19 April 2019 8:16 AM GMTఅందుకే అంటారు.. రంగం కొత్త అయినప్పుడు లోతు గురించి ఆలోచించకుండా ఏదైనా చేసేస్తుంటారు. లోతు తెలిసినప్పుడు భయం ఉంటుంది. జాగ్రత్త వస్తుంది. అలాంటి అవగాహన లేనప్పుడు ఏమైనా చేసేందుకు వెనుకాడరు ఉత్సాహవంతులు. రాజకీయం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా రంగీలా భామ ఊర్మిళా నోటి నుంచి మోడీని ఉద్దేశించి ఇలాంటి మాటలు వచ్చేవి కావేమో?
ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని ఉద్దేశించి ఒక మాట అనాలంటే బోలెడంత గట్స్ ఉండాలి? మోడీ కానీ ఒక చూపు చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే పలువురు విషయంలో అర్థమైన పరిస్థితి. ఇలాంటి వేళ.. మోడీని ఉద్దేశించి పుసుక్కున ఒక మాట అనేసినంత సింఫుల్ గా ఎటకారం ఆడేశారు ఊర్మిళా.
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్లాన చేసిన మోడీ బయోపిక్.. ఈసీ నిర్ణయం బయటకురాకపోవటంతో రిలీజ్ కు నోచుకోకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోడీ బయోపిక్ పై ఊహించిన రీతిలో ఎటకారం ఆడేశారు ఊర్మిలా. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తాజా ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. ఏం సాధించారని బయోపిక్ తీశారు? ఆయనపై బయోపిక్ కంటే ఒక కామెడీ సినిమా తీస్తే సరిపోతుందని మండిపడ్డారు.
ఆ సినిమాలో 56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తిని దేశానికి ప్రధానిని చేసినా ఏమీ చేయలేకపోయారనే సన్నివేశాలు చూపించాలన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించిన ఆయన.. ప్రధాని అయ్యాక వాటిని వదిలేశారన్నామె.. హామీల్ని మరిచి ప్రజల్ని మోసం చేసిన వైనాన్ని ప్రజలకు చూపించాలన్నారు. తోపుల్లాంటి విపక్ష నేతలు మోడీని తిట్టేందుకు మాటలు వెతుక్కుంటున్న వేళ.. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఊర్మిళ మాత్రం ఘాటుగానే వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.