Begin typing your search above and press return to search.
ఆ సీఎంకు వివాదాలే ఇష్టం..ఇంజినీర్లపై కామెంట్లు
By: Tupaki Desk | 29 April 2018 4:29 AM GMTబీజేపీ నేత - త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ వివాదాల ప్రియుడిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందని వ్యాఖ్యానించి అందరినీ ఆలోచనలో పడేయడం - అనంతరం ఆయన తీరు కామెడీ పాలవడం - డయానా హెడెన్ ను ప్రపంచ సుందరిగా ఎలా ఎన్నుకున్నారో అని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తదుపరి క్షమాపణలు చెప్పిన ఆయన మరోసారి అటువంటి మాటలే మాట్లాడారు. అగర్తలాలోని ప్రజ్ఞాభవన్ లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ - మెకానికల్ ఇంజినీర్లు సివిల్ సర్వీసులకు పనికిరారని - వారి కంటె సివిల్ ఇంజినీర్లే ఇందుకు తగినవారని అన్నారు.
గతంలో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్లు మాత్రమే సివిల్ సర్వీసు పరీక్షలు రాసేవారనీ ఇప్పుడు మెడిసిన్ - ఇంజినీరింగ్ చదివిన వారు కూడా సివిల్ సర్వీసుల్లో చేరుతున్నారని త్రిపుర సీఎం చెప్పారు. సివిల్ సర్వీసుల్లో చేరేవారు ఆల్ రౌండర్ అయి ఉండాలని - వారికి చాలా విషయాలు తెలియాలని అన్నారు. ఆల్ రౌండర్లు అంటే ఎవరన్నదానికి ఆయన క్రికెటర్లు సచిన్ తెందూల్కర్ - కపిల్ దేవ్ ల పేర్లు ఉదాహరించారు. అటువంటి ఆల్ రౌండర్లకు డిమాండ్ అధికంగా ఉంటుందని చెప్పారు. ఇదేమాదిరిగా సివిల్ సర్వీసుల్లో చేరే వారు కూడా అన్ని విషయ నైపుణ్యాలున్న ఆల్ రౌండర్లు అయి ఉండాలన్నారు. సివిల్ ఇంజినీర్లు సివిల్ సర్వీసు అధికారులైతే సమాజ నిర్మాణానికి బాగా కృషి చేయగలుగుతారని ఆయన వివరించారు. మెకానికల్ ఇంజినీర్ల కంటే సివిల్ ఇంజినీర్లే సివిల్ సర్వీసులకు బాగా పనికి వస్తారన్నారు. ఈ యువ బీజేపీ ముఖ్యమంత్రి ఇంటర్నెట్ పై - డయానా హెడెన్ పై చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శల పాలవడం చివరకు ఆయన క్షమాపణ చెప్పాల్సి రావడం జరిగినప్పటికీ తన తీరు మార్చుకోకుండా సివిల్ సర్వీసులను - సివిల్ ఇంజినీరింగ్ తో పోల్చి మరోమారు రచ్చ చేసుకున్న తీరు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.