Begin typing your search above and press return to search.
చికెన్ ప్రియులు.. కాస్త తగ్గితే మంచిది
By: Tupaki Desk | 14 April 2015 11:30 PM GMT రంగారెడ్డి జిల్లాలోని కొన్ని కోళ్ల ఫాంలో అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ సోకిందన్న విషయం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో.. నిత్యం చికెన్ లేకుండా ముద్ద దిగని బ్యాచ్‌కు కొత్త కష్టం వచ్చి పడినట్లే. బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్లను లక్షల్లో చంపేసి.. పాతి పెట్టనున్నారు. అయితే.. అక్కడితోముప్పు తొలిగిపోదు. గాలి ద్వారా వ్యాపించే కారణంగా.. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి బర్డ్‌ఫ్లూ లాంటివి బయటకు వచ్చినప్పుడు చికెన్ ధరలు భారీగా పడిపోవటం కామన్. ముందస్తు జాగ్రత్తగా చాలామంది తినకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అది మంచిదే అయినా అనవసర భయం అక్కర్లేదని కొందరు చెబుతున్నారు. అయితే.. బర్డ్‌ఫ్లూ లాంటి ప్రమాదకరమైన వైరస్ వచ్చిన నేపథ్యంలో కోడికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.
చికెన్ కొనుగోలు నుంచి.. చికెన్ ఆధారంగా తయారు చేసే ఫుడ్ విషయంలో కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే.. మంచిదన్న హెచ్చరికలు చేస్తున్నారు. ఇలా ఎంతకాలం అనే దానికి వెంటనే సమాధానం చెప్పకున్నా.. ఇప్పటికిప్పుడు చికెన్ తీసుకోకుండా ఉంటే మంచిదన్న మాట వినిపిస్తోంది. సో.. చికెన్ అంటే చచ్చిపోయే వారు.. చికెన్ కోసం చావు మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే.. చికెన్.. తదితర ఫుడ్ విషయంలో నాణ్యత.. పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించిన తర్వాతే తినే దాని మీద దృష్టి సారించటం మంచిదని చెబుతున్నారు. సో.. బీకేర్‌ఫుల్.