Begin typing your search above and press return to search.

వామ్మో : చైనాలో మొదటిసారి మ‌నిషికి సోకిన 'బ‌ర్డ్ ఫ్లూ' !

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:30 PM GMT
వామ్మో : చైనాలో మొదటిసారి మ‌నిషికి సోకిన బ‌ర్డ్ ఫ్లూ !
X
బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌ ల‌లో ఒక‌టైన హెచ్‌ 10 ఎన్‌ 3 చైనాలో తొలిసారి ఓ మ‌నిషికి వచ్చింది. ఆ దేశంలోని జియాంగ్‌ సు ప్రావిన్స్‌ లోని ఝెంజియాంగ్ న‌గ‌రంలో ఉండే వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు చైనా నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ (ఎన్‌ హెచ్‌ సీ) మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. ఆ వ్య‌క్తి ఏప్రిల్ 28న జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ల్‌ లో చేరాడు. ఆ త‌ర్వాత మే 28న అత‌నికి ఈ బ‌ర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ సోకిన‌ట్లు అధికారులు తెలిపారు. కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలోనే ఓ మనిషికి బర్డ్‌ ఫ్లూ సోకిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే అత‌నికి ఆ వైర‌స్ ఎలా సోకిందో మాత్రం ఎన్‌ హెచ్‌ సీ చెప్ప‌లేదు. బ‌ర్డ్‌ ఫ్లూ స్ట్రెయిన్‌ ల‌లో చాలా త‌క్కువ తీవ్రత ఉన్న‌ది ఇదే. ఇది పెద్ద ఎత్తున మ‌నుషుల‌కు సోకే అవ‌కాశాలు చాలా చాలా త‌క్కువ‌ని ఎన్‌ హెచ్‌ సీ తెలిపింది. ఆ వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని, త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తార‌ని చెప్పింది. అత‌ని సన్నిహితుల‌ను కూడా ప‌రీక్షించినా ఈ ఫ్లూ ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు. మనుషులకు కూడా ఈ బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందా? అని ప్రపంచ దేశాలు హడలిపోతున్న పరిస్థితి నెలకొంది. చైనాలో బ‌ర్డ్‌ఫ్లూకు చెందిన ఎన్నో స్ట్రెయిన్‌లు ఉన్నాయి. అత్యంత అరుదుగా ఇందులోని కొన్ని స్ట్రెయిన్‌ లు మ‌నుషుల‌కు సోకుతున్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీల్లో ప‌నిచేసే వాళ్ల‌కు ఇది సోకుతోంది. 2016-17లో హెచ్‌ 7ఎన్‌ 9 వైర‌స్ సుమారు 300 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. ఆ త‌ర్వాత ఎక్క‌డా ఈ వైర‌స్ మ‌నుషుల‌కు సోకిన‌ట్లు తేల‌లేదు. అంతేకాదు ఈ తాజా హెచ్‌ 10ఎన్‌ 3 వేరియంట్ కూడా గ‌తంలో ప్ర‌పంచంలో ఏ మ‌నిషికీ సోక‌లేద‌ని ఎన్‌ హెచ్‌ సీ స్ప‌ష్టం చేసింది.

ఇప్పటి వరకూ పక్షులకు ముఖ్యంగా కోళ్లకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చాలా కాలం నుంచి ప‌రిశోధ‌కులు అంచనాలు వేశారు. కొంతమంది సైంటిస్టులు మనుషులకు కూడా వస్తుందని చెప్పారు. కానీ అది ఇప్పుడు అదే చైనాలో నిజ‌మై కనిపిస్తోంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌ లోని జెన్‌ జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఆ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ స్వయంగా ప్రకటించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ విభాగం వారం రోజుల క్రితం సదరు రోగికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. బర్డ్ ఫ్లూ సోకిన బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశాడ‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు. దీంట్లో భాగంగా కొంతమందిని ఇప్ప‌టికే గుర్తించిన‌ వారంద‌రినీ పరీక్షలు చేస్తున్నారు. అలా వారిని నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా.. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి పెద్దగా లేదని నామ మాత్రంగా మాత్రమే ఉందని కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందవద్దని తెలిపారు. కాగా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తున్న కరోనా వైరస్ చైనా నుంచే ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే ఆరోపణలు ఉన్నాయి.