Begin typing your search above and press return to search.
అదిరే ఆఫర్.. ఐదు పైసలకు ప్లేటున్నర బిర్యానీ
By: Tupaki Desk | 17 Oct 2019 7:40 AM GMTఅడుక్కునోటోడికి రూపాయి ఇస్తే.. కిందామీదా చూసే పరిస్థితి. అంతేనా.. రూపాయి బిళ్లకు సరైన పప్పుండ రాని రోజులివి. అలాంటిది ఏకంగా ప్లేటున్న బిర్యానీ ఇచ్చేస్తామంటూ ఒక హోటల్ పెట్టిన ఆఫర్ కు ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చిందట. తమిళనాడులోని దిండుక్కల్ కు చెందిన హోటల్ లో ఈ అదిరే ఆఫర్ పెట్టారు. అయితే.. ఒక కండిషన్ పెట్టారు.
తాము పెట్టిన ఆఫర్ ను దక్కించుకోవాలంటే పాత కాలం నాటి ఐదు పైసల నాణెం తీసుకురావాలని.. అది కూడా మొదట వచ్చిన వందమందికి మాత్రమే ఇస్తామన్నారు. బ్యానర్ కట్టి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో.. ఇంట్లో ఎప్పుడో ఒక పక్కన పడేసిన ఐదు పైసలు బిళ్లల్ని తీసుకొని హోటల్ ముందుకు భారీగా చేరుకున్నారు.
ఇంతకీ ఈ హోటల్ పెద్ద మనిషి ఇలాంటి ఆఫర్ ఎందుకు పెట్టాడన్న విషయంలోకి వెళితే.. కీళడిలో 2300 ఏళ్ల క్రితం జీవించిన ప్రజలకు చెందిన వస్తువులు.. నాణెలు దొరికిన నేపథ్యంలో రానున్న తరాలకు మనం గతంలో వినియోగించే వస్తువులు.. నాణెలపై అవగాహన కల్పించేందుకు ఈ భారీ ఆఫర్ పెట్టినట్లు చెప్పారు. మొత్తానికి వినూత్నంగా ఆఫర్ పెట్టి.. అందరి కంట్లో పడటమే కాదు.. తన హోటల్ కు మంచి పేరును తెచ్చుకున్నాడీ తంబి. తెలివి అంటే ఇలానే ఉండాలి మరి.