Begin typing your search above and press return to search.
కరోనా మహమ్మారి తో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత
By: Tupaki Desk | 17 May 2021 6:42 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ తో దేశ ప్రక్కలు విలవిలలాడిపోతున్నారు. కరోనా మొదటి వేవ్ నుండి దేశంలోని సామాన్యుల నుండి ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. మొదటిసారి దేశంలో సమానత్వం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదం లేదు. మొదటి వేవ్ లో కేవలం కరోనా మహమ్మారి పాజిటివ్ గా నిర్దారణ అయినా కూడా ప్రాణాలకి పెద్దగా ప్రమాదం లేదు. కానీ, సెకండ్ వేవ్ లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కరోనా మరణ విషాదం వెంటాడింది. కుటుంబ సభ్యులు కరోనా తో కన్నుమూయడమో , బంధువులో, సన్నిహితులో ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీని మరణం పలుకరించింది.
సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం, దాన్ని గుర్తించి కళ్లు తెరిచే నాటికే ప్రాణాలు పోయిన ఘటనలెన్నో. కరోనా వైరస్ తో తీవ్ర ప్రభావితమైన రంగాల్లో మీడియా కూడా ఒకటి. వారు పేరుకు మాత్రమే ఫ్రంట్ లైన్ వారియర్స్. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహాకారాలు పెద్దగా అందలేదనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇక వారు పని చేసే యాజమాన్యాల గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. వార్తల సేకరణలో ముందు ఉండటం, కరోనా వైరస్ బారిన పడినప్పుడు దాని నుంచి కాపాడే విషయంలో చివర్లో ఉన్న మీడియా సంస్థల కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడిచారు.
ఇలా విడిచిన వారిలో సామాన్య పాత్రికేయులతో పాటుగా మొదలు సంస్థ ఎండీ వరకు ఉండటం గమానర్హం. ప్రఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు ఛైర్ పర్సన్ ఇందుజైన్ మొదలు కొని ఎందరో కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా ఒడిశాకు చెందిన ఒక టీవీ చానల్ ఎండీ మృతిచెందడం సంచలనంగా మారింది. ఒడిశా భాస్కర్ లాంటి దినపత్రిల్లో రిపోర్టర్ గా పని చేసిన భిష్ణు ప్రసాద్ సాహు.. మూడేళ్ల క్రితం బరంపుర నగరంలో కళింగ దర్పన్ పేరుతో ఒక టీవీ చానల్ ను ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా కరోనా బారిన పడిన సాహు, చికిత్సలో భాగంగా టాటా కోవిడ్ కేర్ సెంటర్లో చేరారు. అయితే , అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల గంజాం, బరంపురం ప్రాంతాల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు.