Begin typing your search above and press return to search.

కుప్పకూలుతున్న బిట్ కాయిన్..: వారంలో 30 శాతం దిగువకు..

By:  Tupaki Desk   |   17 Jun 2022 1:30 AM GMT
కుప్పకూలుతున్న బిట్ కాయిన్..: వారంలో 30 శాతం దిగువకు..
X
బిట్ కాయిన్.. క్రిప్టో కరెన్సీ.. గత సంవత్సరం ముందు వరకు ఈ పేర్లు ఇతర దేశాల్లో మాత్రమే వినిపించేవి. వీటిపై అవగాహన పెరగడంతో భారత్ లోనూ కొందరు వీటిపై ఇన్వెస్టు చేవారు. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తమ షేర్లను కొనాలని ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే గత సంవత్సరం ముందు వరకు భారత్ లో క్రిప్టో కరెన్సీని నిషేధించారు. కానీ గత బడ్జెట్ లో దీనికి పన్నును పెంచుతూ అనుమతించారు. దీంతో చాలా మంది క్రిప్టోకరెన్సీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొత్త కొత్తలో చాలా మందికి అనుకూల ఫలితాలు వచ్చాయి. కానీ గత ఆరు నెలల నుంచి వీటి విలువ పడిపోతూ వస్తోంది. జూన్ 15 నాటికి బిట్ కాయిన్ విలువ 20 వేల డార్లకు పడిపోయింది.

తాజాగా బిట్ కాయిన్ విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. జూన్ 9 నాటితో పోలిస్తే వారం రోజుల్లో 30 శాతానికి పడిపోయింది. గత నవంబర్ లో 70 వేల వద్ద ట్రేడ్ అయిన బిట్ కాయిన్ ప్రస్తుతం 20 వేల డాలర్లకు దిగింది. ఈ పరిస్థితి ఇంకా మారవచ్చు అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ కంటే ముందే బిట్ కాయిన్, ఎథేరియం వంటి ప్రముఖ క్రిప్టో కరెన్సీల విలువ పడిపోవడం ముదుపరులు గమనించారు. దీంతో చాలా మంది తమ వాటాలను అమ్ముతూ వచ్చారు. కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేసేవారి సంఖ్య విపరీతంగా తగ్గింది.

బిట్ కాయిన్ విలువ పడిపోవడానికి ప్రపంచ పరిస్థితులే కారణం. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిపోవడంతో క్రిప్టో కరెన్సీ మాత్రమే కాకుండా ఇతర వస్తువులను కొనుగోలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.

వీటికి తోడు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యలు నుంచి ధనికుల వరకు పెట్టుబడుల జోలికి వెళ్లడం లేదు. చాలా మంది డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీ వైపు అసలే చూడడం లేదు. అసలే క్రిప్టో కరెన్సీ కొన్ని దేశాల్లో మాత్రమే అధికారికంగా గుర్తింపు పొందింది. తాజాగా వస్తున్న మార్పులతో ఆ దేశాల్లో కూడా వీటిపై మోజు తగ్గడం గమనార్హం.

కొత్తగా కొనేవారి కంటే ఉన్నవారు అమ్మేవారే తయారవుతున్నారు. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది బిట్ కాయిన్. గడిచిన మూడు నుంచి నాలుగు రోజుల్లో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే క్రిప్టో ఎక్ఛేంజ్ సంస్థల్లో ఒకటైన గ్లోబల్ క్రిప్టో ఎక్చేంజ్ బినాన్స్ ఇటీల బిట్ కాయిన్ విత్ డ్రాలను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. సాంకేతిక కారణాలు అని చెప్పినా విక్రయాలను అపేందుకే అని కొందరు అంటున్నారు. మరో కంపెనీ క్రిప్టో లెండర్ సెల్సియస్ కూడా విత్ డ్రాలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే కాయిన్ బేస్ ఎక్చేంజ్ లో కూడా బిట్ కాయిన్ కుప్పకూలడంతో తన సిబ్బందిలో 18 శాతం మందిపై వేటు వేసింది.

మరి మళ్లీ మంచిరోజులు ఎప్పుడొస్తాయి..? అని కొందరు ప్రశ్నస్తున్నారు. అయితే కొందరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మాత్రం ఇది మంచి సమయమని అంటున్నారు. ఎందుకంటే అతి తక్కువ ధరకు బిట్ కాయిన్ ను పొందవచ్చని అంటున్నారు. ఇలా కొన్ని కాయిన్స్ కొనుగోలు చేసి సువర్ణ అవకాశం కోసం వేచి చూడాలని అంటున్నారు. అంటే ఇప్పుడు వాటిని కొని పెట్టుకొని కొన్ని రోజుల పాటు వెయిట్ చేస్తే మంచి లాభం ఉంటుందని అంటున్నారు.