Begin typing your search above and press return to search.
త్వరలో.. `కట్నంగా` బిట్ కాయిన్..!
By: Tupaki Desk | 15 Nov 2021 1:30 PM GMTఏంటి? నిజమా? అంటున్నారా? నిజమే! రాబోయే రోజుల్లో బిట్ కాయిన్‌దే ప్రపంచం అంటున్నారు నిపుణులు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. కరెన్సీలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలా.. వస్తున్నదే బిట్ కాయిన్.
ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల వాడుకలోకి కూడా వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా.. బిట్ కాయిన్ గురించే చర్చ జరుగుతోంది. అంతేకాదు... వార్తాపత్రికల్లోనూ.. రోజూ.. దీని గురించి రాస్తున్నారు కూడా. ఇక, భారత ప్రభుత్వం కూడా బిట్‌కాయిన్‌పై చర్చలు చేస్తోంది. డిజిటల్ యుగంలో కరెన్సీ అయిన.. క్రిప్టోలో.. ఇప్పుడు.. బిట్‌కాయిన్‌దే టాప్ అంటున్నారు నిపుణులు.
ఇంతకీ బిట్ కాయిన్ అంటే ఏంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బిట్ కాయిన్.. పరిచయం అవసరం లేని సంచలనం. దీని మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. ఒక పదేళ్ల క్రితం పైసలు చెల్లించి వీటిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు.
ఎందుకంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు కేవలం పైసల్లో ఉన్న ఒక్క బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం మనదేశ కరెన్సీలో అక్షరాలా రూ. లక్షలు. ఇంత సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా మరింత పుంజుకుంటోంది.
బిట్‌కాయిన్ అనేది ఒక క్రిప్టోకెరెన్సీ. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ ఇదే. సతోషి నకమోటో అనే పేరును ఉపయోగించి దీన్ని మొదట చెలామణీలోకి తీసుకువచ్చారు. దీన్ని 2008లో రూపొందించారు. 2008 ఆగస్టు 18వ తేదీన ‘bitcoin.org’ అనే డొమైన్ మొట్టమొదటిసారి రిజిస్టర్ అయింది. 2009 జనవరి 3వ తేదీన బిట్ కాయిన్ నెట్ వర్క్‌ను రూపొందించి మైనింగ్ ప్రారంభించారు.
హెరాల్డ్ థామస్ ఫినే II అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ బిట్‌కాయిన్ లావాదేవీని అంగీకరించిన మొదటి వ్యక్తి. సతోషి నకమోటో నుంచి 10 బిట్ కాయిన్లను ఈయన అందుకున్నారు. ఈ లావాదేవీ 2009 జనవరి 12వ తేదీన జరిగింది.
2011 జనవరిలో ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ అనే సంస్థ బిట్‌కాయిన్ లావాదేవీలను అంగీకరిస్తామని తెలిపింది. అయితే కొత్త కరెన్సీ వ్యవస్థలకు చట్టబద్ధత ఉంటుందో, లేదో అనే భయాలతో అదే సంవత్సరం జూన్‌లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2011 జూన్ నుంచి సంచలన సంస్థ వికీలీక్స్.. బిట్‌కాయిన్ రూపంలో డొనేషన్లను అంగీకరిస్తామని తెలిపింది.
దీంతో మరిన్ని సంస్థలు కూడా అదే బాట పట్టాయి. మెల్లగా బిట్‌కాయిన్ పాపులర్ అవ్వడం కూడా మొదలైంది. 2012లో వెయ్యి మందికి పైగా వ్యాపారులు బిట్‌కాయిన్‌ను పేమెంట్‌గా అంగీకరిస్తున్నట్లు బిట్‌కాయిన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడ్ బిట్ పే తెలిపింది.
2013లో ఒకే నెలలో 1 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. అదే సంవత్సరం నవంబర్‌లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నకోసా కూడా బిట్ కాయిన్ పేమెంట్లను తీసుకోవడం ప్రారంభించింది. ఆ యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అప్పుడు బిట్‌కాయిన్‌ను ‘భవిష్యత్తు బంగారం’గా అభివర్ణించాడు.
ఇదిలావుంటే.. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ కూడా తన జీతాన్ని బ్రిక్‌పిన్‌లో తీసుకునేందుకు రెడీ అంటూ.. ప్రకటన జారీ చేశారు. ఫ్లోరిడా స్టేట్ ప్రభుత్వం కూడా ప్రజల నుంచి స్వీకరించే పన్నులను బిట్ కాయిన్ రూపంలో చెల్లించవచ్చని.. ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో బిట్ కాయిన్ దే ప్రపంచం అంటున్నారు పరిశీలకులు. సో.. బంగారంగా పిలవబడుతున్న బిట్ కాయినే.. రేపు కట్నంగా ఇచ్చే రోజులు.. అడిగే రోజులు రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.