Begin typing your search above and press return to search.
బిట్ కాయిన్ ఇష్యూ.. ప్రముఖుల ఖాతాలే వారి లక్ష్యమా?
By: Tupaki Desk | 12 Dec 2021 11:30 PM GMTబిట్ కాయిన్ వ్యవహారంతో చాలామంది మోసపోతున్నారు. బిట్ కాయిన్ల కొనుగోళ్లలో ఇప్పటికే ఎంతోమంది నిలువునా మునిగారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఎన్నో ఫేక్ వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఆదివారం నాడు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. పీఎం ట్విట్టర్ ను హ్యాక్ చేసిన దుండగులు... ఏకంగా బిట్ కాయిన్లను ప్రమోట్ చేస్తూ ట్వీట్లు చేశారు.
బిట్ కాయిన్లను భారత దేశంలో లీగల్ చేసినట్లు పీఎం ట్విట్టర్ లో హ్యాకర్లు ట్వీట్ చేశారు. అంతేకాకుండా 500 బిట్ కాయిన్లు ప్రభుత్వం కొని... ప్రజలకు పంచుతోందని పోస్టులు పెట్టారు. దీన్ని గమనించిన పీఎంవో వెంటనే అప్రమత్తమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన ఆ సంస్థ... పీఎం ఖాతాను పునరుద్ధరించింది. ఈ సమస్యను పరిష్కరించింది.
బిట్ కాయిన్ల ప్రమోషన్ కోసం పీఎం ఖాతా హ్యాక్ కావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఇలాంటి హ్యాకింగ్ ఇది తొలిసారి కాదని టెక్ నిపుణులు అంటున్నారు. ప్రముఖులైన బరాక్ ఒబామా, ఎలన్ మస్క్, బైడన్, బిల్ గేట్స్ వంటి వారి ఖాతాలు హ్యాక్ అయ్యాయని చెబుతున్నారు. అంతేకాకుండా యాపిల్, ఊబర్ వంటి కంపెనీల అధికారిక ఖాతాలను కూడా హ్యాక్ చేశారని తెలిపారు. ప్రముఖుల ఖాతాల్లో బిట్ కాయిన్ల ప్రమోషన్ కు యత్నించారని తెలిపారు.
ప్రముఖుల ట్విట్టర్ ఖాతా హ్యాక్ లపై అప్పుడు స్పందించిన ట్విట్టర్... చర్యలు చేపడుతామని ప్రకటించింది. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ప్రకటించింది. అయితే అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరగలేదని నిపుణులు అంటున్నారు. ఇకపోతే ప్రధాని వ్యక్తిగత ఖాతానే హ్యాక్ అయితే... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హ్యాకర్లను గుర్తించి... తమ ఖాతాలకు పూర్తిస్థాయి భద్రతా ఉండేలా చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల సంస్థలను కోరుతున్నారు.