Begin typing your search above and press return to search.
వీరి ప్రేమ బంగారం గానూ.....
By: Tupaki Desk | 14 Jun 2017 4:25 PM ISTమనసు పలికే భాష ప్రేమ... మౌనమడిగే బదులు ప్రేమ.....మరణమైనా తోడు ప్రేమ..... భార్యా భర్తలు - ప్రేమికుల మధ్య ఇటువంటి ప్రేమ పాటలను చాలా విని ఉంటాం. ఇటువంటి పాటల నుంచి స్ఫూర్తి పొందాడో భర్త. నిజ జీవితంలో కూడా తనతో పాటు తన భార్య కూడా చనిపోవాలనుకున్నాడు.
పాముకాటుకి గురైన తాను చనిపోతే తన భార్య ఒంటరిగా ఎలా బతుకుతుందని బెంగపడ్డాడు. ఇద్దరూ కలిసి చనిపోవాలనుకుని ఆమె చెయ్యిని కొరికేశాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటనలో భర్త మృతి చెందగా అతడి భార్య మాత్రం ప్రాణాలతో బయటపడింది.
బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాకి చెందిన శంకర్‌రాజ్ అనే వ్యక్తి నిద్రపోతుండగా పాము కాటేసింది. నిద్రలేచి చూసుకునే సరికి తన ఒళ్లంతా విషం ఎక్కేసింది. ఇంక తాను బతకనని నిర్ధారించుకున్నాడు. తన భార్య కూడా తనతో పాటే చనిపోవాలని భావించాడు. నిద్రపోతున్న తన భార్య అమ్రీ దేవి చెయ్యిని అమాంతం కొరికేశాడు.
దీంతో భార్యాభర్తలిద్దరూ స్పృహ కోల్పోయారు. ఈ విషయం గమనించిన ఇరుగుపొరుగు వారు దంపతులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శరీరమంతా విషం ఎక్కడంతో శంకర్ రాజ్ మరణించాడు. అమ్రీ దేవికి వైద్యులు చికిత్స చేసి బ్రతికించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/