Begin typing your search above and press return to search.
స్టీల్ ప్లాంట్ వద్ద సీపీఐ నారాయణకి చేదు అనుభవం .. ఏమైందంటే ?
By: Tupaki Desk | 9 July 2021 6:39 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఆందోళనలతో అట్టుడికిపోతుంది. కేంద్ర ప్రభుతం తీరుకు నిరసగా కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఆష్టదిగ్బంధనానికి పిలుపు ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరో ముందడుగు వేసి, 100 శాతం పెట్టుబడులకు సంబందించి కేంద్ర ప్రభుత్వం బిడ్స్ ను ఆహ్వనించింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా లీడ్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్స్ అడ్వైజర్ల కోసం ప్రభుత్వం బిడ్లకి ఆహ్వానం ఇచ్చింది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. దీనితో అక్కడ ఆగ్రహజ్వాలలు మరింత ఎక్కువైయ్యాయి.
ఈ వ్యవహారం పై తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. అయితే , ఆయనకి స్టీల్ ప్లాంట్ దగ్గర చేదు అనుభవం ఎదురైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డిలపై నారాయణ చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాల నేతలు ఖండించారు. నారాయణ ప్రసంగానికి కార్మిక సంఘాల నేతలు అడ్డుతగిలారు. స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని సూచించారు. ఇప్పటికే సీఎం రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని కార్మి సంఘాలు గుర్తుచేశాయి. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని కార్మిక సంఘాల నేతలు అన్నారు. సిపిఐ నారాయణ మాట్లాడుతూ .. సీఎం మోదీకి రాసే ప్రేమలేఖల వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. సీఎం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ వద్ద శిబిరానికి రావాలని..ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరగాలని అన్నారు. అన్నీ ఆదానికి, అంబానీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని, సంపదను అమ్మేస్తున్నారని విమర్శలు చేశారు. విశాఖకు అన్యాయం జరుగుతుంటే కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. విశాఖకు, స్టీల్ ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు.. మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని హరిబాబు చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆపగలరని తెలిపారు. ఈ వ్యవహారంపై వెంకయ్యనాయుడు నోరు తెరవాలని..ఆపే శక్తి ఆయనకు ఉందని అన్నారు స్టీల్ ప్లాంట్ పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రజాపోరాటాలకు, ప్రాణ త్యాగానిని సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.