Begin typing your search above and press return to search.
బీజేపీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బరిలో ఆ అగ్ర నిర్మాత!?
By: Tupaki Desk | 16 Sep 2022 12:30 AM GMTతెలంగాణలో వచ్చేసారి అధికారంలోకి రావడానికి కేంద్రంలోని బీజేపీ చేయని ప్రయత్నం లేదు. నెలకు ఒక్కసారైనా బీజేపీ పెద్దలు తెలంగాణ టూర్ కు వస్తున్నారంటే వారు ఎంతగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే సినీ గ్లామర్ కోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నితిన్ లాంటి వారిని కలిశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ఇప్పటి నుంచే అన్ని వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు మూడోసారి విపరీతమైన వ్యతిరేకత వచ్చిపడుతోంది.దాన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పై కన్నేసి పలువురు ప్రముఖులను బీజేపీ లాగాలని చూస్తోంది. తెలంగాణలోని సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకొని బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన యువ సంచలన నిర్మాతపై బీజేపీ కన్నేసినట్టు సమాచారం. టాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్న నిర్మాతను హైదరాబాద్ లోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందట.. ఈ మేరకు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇటీవల ‘ది కశ్మర్ ఫైల్స్’ అనే సినిమాను తీసి విడుదల చేశారు. బీజేపీ దీన్ని ఓన్ చేసుకొని తెగ ప్రచారం చేసింది. బీజేపీ బూస్ట్ ఇచ్చి.. తమ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను రాయితీ ఇవ్వడంతో ఈ సినిమాకు లాభాల పంట పండింది. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు.కశ్మీర్ పండింట్ల ఊచకోతపై వచ్చిన ఈ చిత్రం.. బీజేపీకి ఆయుధమైన హిందుత్వం మీద సినిమా తీయడంతో ఆ పార్టీ ఓన్ చేసుకుంది. ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది మన తెలంగాణనే. హైదరాబాద్ కు చెందిన వారే.
ఇక ఇటీవల కృష్ణతత్వంతో ఇదే నిర్మాత ‘కార్తికేయ2’ చిత్రాన్ని తీశారు. ఇది బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. దీంతో బీజేపీ విజన్ కు తగినట్టుగా అభిషేక్ అగర్వాల్ సినిమాలు తీస్తున్నట్టు ఆ పార్టీ గ్రహించింది.
అభిషేక్ అగర్వాల్ గతంలో వీహెచ్.పీ, ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. హిందూపరిరక్షణ సంస్థతో కలిసి పనిచేశారు. పైగా ఇప్పుడు బీజేపీ మెచ్చే సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ అగర్వాల్ కు బీజేపీ ఆఫర్ ఇచ్చిందన్న ఒక వార్త వైరల్ అవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక కీలక స్థానం నుంచి అసెంబ్లీ బరిలో అభిషేక్ అగర్వాల్ ను బరిలోకి దించేందుకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసిందని ప్రచారం సాగుతోంది. దీనికి అభిషేక్ అగర్వాల్ కూడా ఓకే చెప్పారని.. హైదరాబాద్ లోని ఓ కీలక నియోజకవర్గంలో పోటీకి ఒప్పుకున్నట్టు తెలిసింది.
అయితే దీనిపై అటు బీజేపీ కానీ.. ఇటు అభిషేక్ అగర్వాల్ కానీ అధికారికంగా స్పందించలేదు. రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం.. సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.