Begin typing your search above and press return to search.
టీడీపీతో జనసేనాని పొత్తు.. బీజేపీ ఏమందంటే!
By: Tupaki Desk | 29 Oct 2022 11:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్య పరిరక్షణ' కోసం అంటూ.. ఇరువురూ చేతులు కలిపి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అయ్యారు. అయితే.. ఇక్కడ ఈ విషయాన్ని బీజేపీకి చెప్పకపోవడంతో పవన్ విషయంలో ఆశలు పెట్టుకున్న కమలం నేతలు ఖంగుతిన్నారు. నిజానికి గతాన్ని వదిలేస్తే.. 2020 నుంచి మళ్లీ జనసేన-బీజేపీ పొత్తులోనే కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు కూడా కలిసిముందుకు సాగాలని సంకల్పం చెప్పుకొన్నాయి.
నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని బీజేపీ పెద్దలతోనే భేటీ అయిన పవన్ పొత్తుకు తెరదీశారు. అయితే.. చేతులు కలిసినంత ఈజీగా మనసులు మాత్రం కలవలేక పోయాయనేది వాస్తవం. అంటే ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాన్ని ఉమ్మడి ముందుకు తీసుకువెళ్లలేక పోయాయి. నిజానికి అనేక అవకాశాలు వచ్చాయి. రామతీర్థం, విజయవాడ దుర్గమ్మ రథానికి చెందిన వెండి సింహాలుమాయం, ఆలయాలపై దాడులు ఘటన లు జరిగినప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజుత మను సంప్రదించకుండానే కార్యక్రమాలు చేపట్టారనేది జనసేన వాదన.
దీంతో ఎవరికివారు గానే ఆయా ఘటనలపై ఉద్యమించారు. తర్వాత ఎస్సీలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని జనసేన సీరియస్‌గా తీసుకుంటే బీజేపీ లైట్ తీసుకుంది. దీంతో అప్పుడు జనసేన ఒంటరిగానే ఉద్యమించింది. ఈ పరిణామాలకు తోడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మేమే పోటీ చేస్తామని జనసేన ప్రకటించగా.. పట్టుబట్టి మరీ బీజేపీ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేసి మరీ ఈటికెట్ సంపాయించుకున్నారు. తర్వాత.. పవన్‌ను బలవంతంగా ప్రచారానికి ఒప్పించారు. నిజానికి చెప్పాలంటే పొత్తుకు అంతోఇంతో విలువ ఇచ్చింది పవననే అంటారు రాజకీయ విశ్లేషకులు.
పవన్ సినిమా భీమ్లానాయక్ సమయంలో టికెట్ల వివాదం తెచ్చినప్పుడు బీజేపీ మౌనంగా ఉండిపోయింది. ఇక, ఆయన కౌలు రైతు యాత్ర చేసినప్పుడు సంఘీభావం ప్రకటించాలని కోరినా.. పట్టించుకోలేదు. అయినా పవన్ కలిసే ఉన్నారు. ఆయన కోరింది ఒక్కటే వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకు చీలిపోకుండా చూసేందుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. కానీ, ఈ విషయాన్ని కూడా బీజేపీ నేతలు పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే విశాఖ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ సమయంలో స్పందించిన బీజేపీ పవన్‌ను వెనుకేసుకువచ్చి ఆయనను పరామర్శించింది.
కానీ, పవన్ ఆశించినట్టు మాత్రం బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఈ పరిణామాలతో విసుగు చెందిన పవన్ నేరుగా చంద్రబాబుతో చేతులు కలిపారు. ఇది బీజేపీకి సుతరామూ ఇష్టంలేదు. దీంతో వెంటనే ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు ఇక్కడి పరిణామాలు వివరించారు.
ఆ రెండు రోజులకే పవన్‌కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. ''పొత్తులకు అప్పుడే తొందర ఎందుకు. ఏ పార్టీతో చేతులు కలపాలో ఇప్పుడు నిర్ణయించుకుంటే.. అది అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుందికదా!'' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా..పవన్‌ను టీడీపీకి దూరం చేయడమే బీజేపీ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.