Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
By: Tupaki Desk | 30 Oct 2021 6:05 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. నేతల మధ్య గొడవలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో రెండు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కోర్కల్ లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాల ప్రజలను చెదరగొట్టారు.
ఇల్లందకుంట మండలం శ్రీరాముల పల్లి గ్రామంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ ఇన్ చార్జి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పై ప్రత్యర్థి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ స్టేషన్ లో టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ కూడా కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.
హుజూరాబాద్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నాడు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ కూడా కుటుంబ సమేతంగా ఓటు వేశారు.
హుజూరాబాద్ లో ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేస్తున్న వారిని అడ్డుకొని కొందరు ఫిర్యాదు చేశారు.