Begin typing your search above and press return to search.

బిజేపీ బిగ్ ప్లాన్.. మమతా బెనర్జీ సర్కార్ ను కూల్చేందుకు ప్లాన్?

By:  Tupaki Desk   |   22 Nov 2022 3:36 PM GMT
బిజేపీ బిగ్ ప్లాన్.. మమతా బెనర్జీ సర్కార్ ను కూల్చేందుకు ప్లాన్?
X
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి హైలెవల్ లో ట్రై చేసిన బీజేపీ బ్యాచ్ ను కేసీఆర్ చాకచక్యంగా కూల్చడంతో ఇప్పుడు దాని ఫోకస్ బెంగాల్ పై పడింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీపై పడింది. టీఎంసీ సర్కార్ కు డిసెంబర్ నెలనే చివరి గడువు అని.. డిసెంబర్ లోనే మమతా బెనర్జీ సర్కార్ కుప్ప కూలుతుందని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

బీజేపీ అసన్సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం ఈ మేరకు సంచలన విషయాలు బయటపెట్టారు. తమ పార్టీ భారీ ప్రణాళిక సిద్ధం చేసిందని.. వచ్చే డిసెంబర్ నెలలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోతుందని తేల్చిచెప్పారు. డిసెంబర్ లో ఇక్కడే ఖేలా జరుగనుంది. 30 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు మా పార్టీతో కాంటాక్ట్ లో ఉన్నారు. డిసెంబర్ తర్వాత టీఎంసీ ప్రభుత్వం మనుగడ ఉండదని వారికి తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అగ్ని మిత్ర పాల్. మమతా బెనర్జీ సర్కార్ అవినీతితో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని మండిపడ్డారు.

మా స్ట్రాటజీని మేం వెల్లడించం కానీ.. ఏదో జరుగుతోందని అగ్ని మిత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లోనే బిగ్ గేమ్ ఉంటుందని మా నాయకులు చెప్పారని లీక్ చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి పోతోందని.. ఇది దివాళాకోరు ప్రభుత్వం.. వారి వద్ద డబ్బు లేదు. ఇక వారు పనులెలా చేస్తారు? రాష్ట్రాన్ని నడుపుతున్న సగం మంది ఇప్పుడు జైలులోనే ఉన్నారని.. మిగిలిన వారు జైలుకు వెళతారని.. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారంటూ అగ్నిమిత్ర ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా వారం రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త్వరలోనే మమతా బెనర్జీ అరెస్ట్ అవుతారని.. 40 మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. 41 మంది టీఎంసీ సీనియర్ నేతలు బీజేపీ అగ్రనేతలతో కాంటాక్టులో ఉన్నారని.. డిసెంబర్ నెలలో మమతా సర్కార్ కూలడం ఖాయం అని మజుందార్ వ్యాఖ్యానించారు. అంతకుముందు బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రబర్తి కూడా 21 మంది ఎమ్మెల్యేలు మత పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) తమ విధులు నిర్వహిస్తున్నాయని.. టీఎంసీకి ఈ డిసెంబర్ నెల తుదిగడువు అంటూ కామెంట్ చేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ బెంగాల్ సర్కార్ ను కూడా కూల్చేందుకు రంగం సిద్ధం చేశారని అనుమానాలు బలపడుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.