Begin typing your search above and press return to search.
మోడీ, మేం కలిస్తే వారు మటాషే : అక్బరుద్దీన్
By: Tupaki Desk | 4 Feb 2016 1:08 PM GMTఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ పార్టీ. పొట్టిగా ఏఐఎంఐఎం! ముస్లిం మత రాజకీయాలే ఏకైక ఎజెండాగా, ఓల్డ్‌సిటీ తమ అడ్డగా వేళ్లూనుకుపోయిన పార్టీ. తమ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఇపుడిపుడే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ...హిందుత్వ పునాదులపై ఏర్పడిన జాతీయ పార్టీ. ఈ రెండు పార్టీలకు సిద్ధాంతపరంగా చెప్పలేనంత వైరుధ్యం. ఈ రెండు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది?
ఏంటి మరీ అసాధ్యమైన ఆలోచనతో ఈ వార్త వండేశారు అనుకుంటున్నారా. కానే కాదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఆకాంక్ష ఇది! నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ - తన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం మధ్య పొత్తు ఉంటే దేశంలో కాంగ్రెస్ ను కనుమరుగు చేయవచ్చని అక్బరుద్దీన్ ఒవైసీ ఆకాంక్ష. ఇదేదో మనం ఊహించుకుంటున్నది కాదు. స్వయంగా అక్బర్ చెప్పిన మాటే.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 30న హైదరాబాద్ లోని బాబానగర్ లో జరిగిన సభలో అక్బరుద్దీన్ బీజేపీ పొత్తు గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎంఐఎం-బీజేపీ పొత్తు - కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడం గురించి చెప్పుకొచ్చారు. దీనిపై ప్రముఖ జాతీయ ఛానల్ సీఎన్ ఎన్-ఐబీఎన్ వార్త కథనం రూపొందించింది. ఈ కథనం ప్రకారం అక్బరుద్దీన్ బీజేపీతో పొత్తు గురించి ఆరాటపడుతున్నారని తేల్చింది. అంతేకాదు అక్బర్ కామెంట్లతో వారు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఎంఐఎం-బీజేపీ పొత్తు ఉంటుంది అంటారా? ఏమో గుర్రం ఎగరావచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా!!