Begin typing your search above and press return to search.
బీజేపీ ఊసేది బాస్.. వదులుకున్నట్టేనా?
By: Tupaki Desk | 16 Dec 2022 4:41 AM GMTఔను.. ఏపీలో బీజేపీ ఊసు వినిపించడం లేదు.. కీలక నేతలు ఎవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించిన తర్వాత.. ఆ పార్టీ నేతలు ఎవరూ కిక్కురుమనడం లేదు. మరి ఏం జరిగిందనే విషయం అధికారికంగా తెలియక పోయినా.. అనధికారికంగా మాత్రం ఒక చర్చ పార్టీ వర్గాల మధ్యే జరుగుతుండడం గమనార్హం.
బీజేపీ వ్యూహం మార్చుకుందని..వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీని దాదాపు వదులుకుందని.. కొందరు కమలం పార్టీ నాయకులే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటుండడం గమనార్హం. నిజానికి ప్రధాని మోడీ ఏపీలో ఇటీవల పర్యటించడానికి ముందు.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకునేం దుకు పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రత్యేక కార్యాచరణ కూడా రెడీ చేసుకున్నారు.
కానీ, అది అక్కడికే పరిమితం అయింది. తర్వాత.. దాని ఊసు కూడా ఎత్తక పోవడం గమనార్హం. మరోవైపు.. విశాఖలో ప్రధాని మోడీ.. రాష్ట్ర నేతల చెవిలో ఏం వూదారో కానీ, అప్పటి నుంచి వైసీపీపై విమర్శలు కూడా తగ్గిపోయాయి. అప్పటి వరకు నిప్పులు చెరిగిన సత్యకుమార్‌కానీ పురందేశ్వరి కానీ.. పూర్తిగా మౌనం పాటించారు. కనీసం.. ఒక్కమాట కూడా అనడం లేదు.
మరి దీనివెనుక ఏం జరిగింది? కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏపీ నేతలను ఎందుకు ఇంతగా సుప్తచేతనా వస్థకు చేర్చేశారు? అనేది ఆసక్తిగా మారింది. దీనిని పరిశీలిస్తే.. ఏపీలో మళ్లీ వైసీపీ రావాలనేది కేంద్రంలో ని పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే..ఏపీలో పుంజుకునేం దుకు బీజేపీ అవకాశం ఉంటుందనే విశ్లషణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీని వదిలేసుకునేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమై.. ఇలా చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.