Begin typing your search above and press return to search.
బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ...టార్గెట్ సెప్టెంబర్ 17!
By: Tupaki Desk | 8 Sep 2021 9:06 AM GMTతెలంగాణ లో రాజకీయం ఎప్పుడూ కూడా హాట్ హాట్ గానే సాగుతుంటుంది. ఎన్నికల సమయం లో ఉండే వాతావరణం తెలంగాణ లో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం చాలానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా అన్ని పార్టీలు కూడా కదన రంగంలో కాలుదువ్వుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే మొత్తం ఫోకస్ ఉండేది. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక దసరా తర్వాతే అని తేలడంతో పార్టీ ని బలోపేతం పై నేతలందరూ దృష్టి పెట్టారు.
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ హుజూరాబాద్ పై దృష్టి పెడితే , కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకుపోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి , సఫలం అయ్యారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ఆయన రాక దాదాపుగా ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు కేంద్ర హోం శాఖ మంత్రి కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. ఆయన రాష్ట్రానికి వస్తున్నారని బదులు వచ్చింది.
దీంతో.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం ముందుకు కదులుతోంది. ఈ నెల 17న నిర్మల్ లో భారీ స్థాయిలో సభ నిర్వహించి, పార్టీని మరింతగా జనంలోకి తీసుకువెళ్లేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. సభను విజయవంతం చేయడంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సెప్టెంబర్ 17 నాటికి నిర్మల్ చేరుకునేలే ప్లాన్ చేస్తున్నారు. అమిత్ షా రాకను పార్టీలో సమరోత్సాహం నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం ఇందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి, అదే సెప్టెంబర్ 17న ఆ పార్టీ నేతలు వరంగల్ వేదికగా మహా సభ నిర్వహించాలని ప్లాన్ వేశారు. కానీ.. రాహుల్ గాంధీకి వేరే పనులు ఉన్న దృష్ట్యా అది అయ్యేలా కనిపించడం లేదు. అయినా రేవంత్ రెడ్డి ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వేదికను మార్చి.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో సభ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ కుదిరితే అదే సెప్టెంబర్ 17న గజ్వేల్ లో కాంగ్రెస్ సభ నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది. అతి త్వరలో ఈ విషయమై పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.