Begin typing your search above and press return to search.
బీజేపీ-బీ టీం!.. ఎంఐఎంపై ఈ ముద్ర పోయినట్టేనా?
By: Tupaki Desk | 12 March 2022 2:30 AM GMTహైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం.. పార్టీకి ఒక విశిష్టత ఉంది. ఈ పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా.. జాతీయస్థాయిలో పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో బిహార్‌లో నాలుగు చోట్ల గెలిచింది. తాజాగా యూపీలో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పుంజుకునేందుకు ప్రయత్నించింది. ఏకంగా 97 స్థానాల్లో పోటీ చేసింది.
అయితే.. ఒక్క చోట కూడా విజయం దక్కించుకోలేక పోయింది. అయితే..ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎంఐఎం.. సాధించిన విజయం కంటే కూడా.. పొందిన అపకీర్తులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు.. ఎంఐఎంను.. బీజేపీకి ముడిపెట్టి.. `బీ-టీం`గా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
అంటే.. ఎన్నికల వేళ బీజేపీ కష్టాల్లో పడుతుందని తెలిస్తే.. హఠాత్తుగా ఆ రాష్ట్రంలో ఎంఐఎం ప్రత్యక్షమై పోతుంది. అంతేకాదు.. ఇతర పార్టీలకు పడే.. ముస్లిం ఓట్లను చీల్చి... బీజేపీకి పరోక్షంగా మేలు చేస్తుందనే వాదన కొన్నాళ్లుగా ఉంది.
ఆయా ఓట్లను వాటిని చీల్చడం ద్వారా.. మజ్లిస్ పరోక్షంగా బీజేపీకి సాయం చేస్తుందన్నది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వినిపించిన వాదన. దీంతో బీజేపీకి-ఎంఐఎం.. బీ-టీం.. అనే మాట వచ్చింది. అయితే.. ఇటీవల జరిగిన, నిన్ననే రిజల్ట్ కూడా వచ్చిన యూపీ ఎన్నికల్లోనూ సుమారు 100 నియోజకవర్గాల్లో ప్రబలమైన శక్తిగా ఉన్న ముస్లింల ఓట్లను ప్రధాన ప్రతిపక్షం అఖిలేష్ కూటమికి పడకుండా.. బీజేపీకి పరోక్షంగా మేలు చేసిందనే వాదనను ఎంఐఎం ఎదుర్కొంది.
కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత.. ఎంఐఎం పరిస్థితి ఏంటనేది తేలి పోయింది. యూపీ ఎన్నికల్లో గెలిచి, రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి 41.6 శాతం ఓట్లు దక్కితే.. అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎంకి దక్కింది కేవలం 0.47 శాతం ఓట్లు మాత్రమే.
ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా ఎంఐఎం అక్కడ పెద్ద బ్యాక్ డ్రాప్‌నే ఎదుర్కొంది. దీనిని బట్టి.. ఇప్పటి వరకు విపక్షాలు చేసిన బీజేపీకి-బీటీం! అనే మాట ఇక తొలిగిపోయినట్టేనా? అనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. నిజానికి యూపీలో ఎంఐఎం అధినేత ఓవైసీపై పెద్ద రగడే చోటు చేసుకుంది.
అది కూడా తొలి దశ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామమే. ఓవైసీ కారుపై కొందరు దుండగులు.. కాల్పులు జరపడం.. దీంతో కేంద్రం వెంటనే రియాక్ట్ అవడం.. ఆయన ప్రాణాలకు ముప్పుందని చెప్పి.. భద్రతను కల్పిస్తామనడం.. ఆయన వద్దనడం.. అంతా.. రాజకీయ చర్చకు దారితీశాయి.
దీంతో ఇంకేముంది.. ఓవైసీ.. ఇక.. ప్రబలశక్తిగా ఎదిగారనే విశ్లేషణలు కూడా వచ్చాయి. తీరా చూస్తే.. అక్కడ పరిస్థితి దారుణం. ఏదేమైనా.. గెలుపు ఓటములు పక్కన పెడితే.. ఎంఐఎంపై ఉన్న ప్రధాన విమర్శ.. ఈ ఎన్నికల ఫలితంతో తుడిచిపెట్టుకు పోయిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.