Begin typing your search above and press return to search.
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్రపటేల్
By: Tupaki Desk | 12 Sept 2021 4:40 PM ISTగుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యాడు. ఇవాళ సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో సీఎం భూపేంద్ర పటేల్ ఎంపిక జరిగింది. ఈరోజు బీజేపీ అధిష్టానం సీనియర్ల అభిప్రాయలు తీసుకొని భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్ కోరనున్నాడు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటివరకు సీఎంగా ఉన్న విజయ్ రూపాణి శనివారం గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేసి వైదొలగిన సంగతి తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్ సామాజికవర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది.