Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ కార్యదళాన్ని ప్రకటించిన బీజేపీ
By: Tupaki Desk | 24 Jun 2021 10:30 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ మేరకు దుబ్బాకలోలాగానే అచ్చం అలాంటి ప్లాన్లను రూపొందిస్తోంది. దుబ్బాకలో ప్రతి మండలానికి ఒక సీనియర్ నేతను , ఎమ్మెల్యేను నియమించి అక్కడ గెలుపును సునాయసం చేసుకుంది. ప్రతి గ్రామానికి కూడా కార్యకర్తలను నియమించి టీఆర్ఎస్ గెలుపును అడ్డుకుంది.
ఇప్పుడు అదే ప్లాన్ ను ఇక్కడా అమలు చేస్తోంది బీజేపీ. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇన్ చార్జులను ప్రకటించింది బీజేపీ. ఎట్ట పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ సీటును కోల్పోకూడదనే పట్టుదలతో బీజేపీ ఈ ప్లాన్ వేసింది.
హుజూరాబాద్ టౌన్ ఇన్చార్జిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కీలకమైన పట్టణ బాధ్యతలను అప్పగించింది. ఇక హుజూరాబాద్ రూరల్ మండలానికి రేవూరి ప్రకాష్ రెడ్డిని నియమించింది.ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెండో పెద్ద పట్టణం అయిన జమ్మికుంటకు ఎంపీ అరవింద్ ను ఇన్ చార్జిగా నియమించింది. అలాగే జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నియమించింది.
ఇక వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డిని, కమలాపూర్మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను ఎంపిక చేసింది.ఇక ఓవరాల్ గా నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకునే నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది.