Begin typing your search above and press return to search.
సైదాబాద్ బాలికపై రేప్: తప్పుడు ట్వీట్ చేసిన కేటీఆర్ పై బీజేపీ దాడి
By: Tupaki Desk | 15 Sep 2021 5:30 PM GMTహైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం , హత్య చేసిన నేరస్థుడిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదు. అతడిపై 10 లక్షలు రివార్డ్ ప్రకటించి మొత్తం పోలీసులంతా వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే హత్యాచారం జరిగిన వెంటనే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లలో ‘నిందితుడిని పట్టుకున్నారు’ అని పేర్కొన్నాడు. తర్వాత తాజాగా కేటీఆర్ నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ హోంమంత్రిని, డీజీపీని కోరడం చర్చనీయాంశమైంది. కేటీఆర్ చేసిన ట్వీట్లను పట్టుకొని ఇప్పుడు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేటీఆర్ ప్రస్తుతం ఈ ట్వీట్ వివాదంలో చిక్కుకున్నారు.
సెప్టెంబర్ 12న మంత్రి కేటీఆర్ సైదాబాద్ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ట్వీట్ చేశారు. అనంతరం తాజాగా ‘దిగువ నా ట్వీట్ ను సరిచేయాలనుకుంటున్నాను. అతడిని అరెస్ట్ చేసినట్లు నాకు తప్పుడు సమాచారం వచ్చింది. తప్పుడు ప్రకటనను చింతిస్తున్నాను. నేరస్తుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ పోలీసులు అతడి కోసం భారీ వేటను ప్రారంభించారు’ అని కేటీఆర్ తెలిపారు. అతడిని త్వరగా పట్టుకొని న్యాయం చేసేలా అందరం మా ఉత్తమ ప్రయత్నాలు చేద్దాం అని కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు.
బుధవారం మంత్రి వివరణ ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర విభాగం కేటీఆర్ పై విరుచుకుపడింది. ఇక రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీపై కూడా బీజేపీ దాడి చేసింది. తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కే. కృష్ణసాగర్ రావు ట్వీట్ లను ఎండగట్టారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళానికి కేటీఆర్ ఒక సూచిక.. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు’ అని విమర్శించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
సెప్టెంబర్ 9న సైదాబాద్ లో 6 ఏళ్ల బాలికపై పొరుగున ఉన్న ఆటో డ్రైవర్ రాజు దారుణ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ భయంకరమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దోషిని ఎన్ కౌంటర్ లో చంపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
మొదట యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన స్వగ్రామం నుంచి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపాయి. అయితే నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ఆచూకీ తెలిపితే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు.