Begin typing your search above and press return to search.
హైకోర్టు తీర్పుపై కక్కలేక.. మింగలేక.. బీజేపీ సతమతం!
By: Tupaki Desk | 15 Nov 2022 1:05 PM GMTతెలెంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయం.
గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముంది. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని టీఆర్ ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.`` అన్నారు.
సీఎం ప్రెస్‌మీట్ నిర్వహించడం పట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని బండి వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
తప్పు చేసిన వాళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకునేది కూడా ఇదేనని తెలిపారు. గౌరవ హైకోర్టు ధర్మాసనం పట్ల మాకు నమ్మకం ఉందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవ రన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉంది అని బండి సంజయ్ పేర్కొన్నారు.
మనసులో మాత్రం..
పైకి బండి ఎంత సుదీర్ఘ ప్రకటన చేసినా.. మనసులో మాత్రం సీబీఐకి ఈ కేసు విచారణకు ఇవ్వకపోవడం పట్ల ఆవేదన ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆది నుంచికూడా రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నం.
దీనికి సీబీఐ అయితేనే కరెక్ట్ అని కూడా వారు భావిస్తున్నారు. అయితే, హైకోర్టు మాత్రం సీబీఐ విచారణకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో కక్కలేక మింగలేక..బీజేపీ నేతలు సతమతం అవుతున్నారు. దీనిపై మారు మాట్లాడలేక పోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.