Begin typing your search above and press return to search.

బీఎల్ సంతోష్ కు ఉచ్చు బిగించడం ఇక కష్టమే

By:  Tupaki Desk   |   2 Jan 2023 3:30 PM GMT
బీఎల్ సంతోష్ కు ఉచ్చు బిగించడం ఇక కష్టమే
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అంతా నడిపించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఇక ఇరికించడం కేసీఆర్ సర్కార్ తో సాధ్యం కాదన్న విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే బీఎల్ సంతోష్ ను నిందితుడిగా చేయాలని సిట్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ముగ్గురు నిందితులుగా చేస్తూ సిట్ గతంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. మొదట కేసు నమోదు చేసినప్పుడు వీరి పేర్లు లేవు. కేవలం నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీల పేర్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత కేసులో బీఎల్ సంతోష్, జగ్గూ స్వామి, తుషార్ ల కుట్ర ఉందని చెప్పి నోటీసులు జారీ చేశారు.

ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకుండా సీఆర్పీసీ 41 నోటీసులు జారీ చేస్తున్నారని వారు కోర్టులో పిటీషన్లు వేశారు. దీంతో సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ పోలీసులు వారినీ నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మొమో దాఖలు చేశారు. అయితే అసలు ఈ కేసును సిట్ దర్యాప్తు చేయడం ఏమిటీని.. చెల్లదని చెప్పి ఏసీబీ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు.వీరి పిటీషన్ కొట్టేసిన హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో వారు నిందితులు కాదని స్పష్టమైంది.

ఇప్పటికే ఈ కేసు సీబీఐకి వెళ్లింది. సిట్ ను రద్దు చేసింది. ఇప్పుడు సీబీఐ కొత్తగా నమోదు చేసిన కేసులోనూ బీఎల్ సంతోష్ పేరు ఉండే అవకాశం లేదు. ఎందుకే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఇరికిస్తుందనుకుంటే పొరపాటే.

ప్రస్తుతం బీజేపీలో వంద కోట్లు ఇస్తామని.. నందకుమార్ ప్రలోభపెట్టారని నందకుమార్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నడుస్తోంది. అందుకే ఈడీ కేసు కేసు నమోదు చేసింది.

ఫాంహౌస్ కేసులో డబ్బుల చెలామణీనే లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటప్పుడు ఈడీ రాకూడదంటున్నారు. కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దీంతో ఈడీ విచారణ కొనసాగనుంది. దీంతో అటు సీబీఐ, ఇటు ఈడీ విచారణ తీరు మారిపోనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.