Begin typing your search above and press return to search.
పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జ్ లను తీసుకొచ్చేసిన బీజేపీ
By: Tupaki Desk | 10 Sep 2022 4:23 AM GMTసార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిన్నరకు పైనే ఉన్నాయి. అయినప్పటికీ.. బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల మీద ఫోకస్ చేసింది. తాను టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావటానికి వీలుగా కొత్త ఎత్తుల్ని వేస్తోంది. వివిధ రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిన మోడీషాలు తెలంగాణకు తరుణ్ చుగ్ ను నియమించటం తెలిసిందే. తాజాగా ఆయన్ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆయన పని తీరుపై పార్టీ అధినాయకత్వం సంత్రప్తి వ్యక్తం చేస్తోంది. ఈ కారణంతోనే ఆయన్ను తెలంగాణకు పార్టీ ఇన్ చార్జిగా కొనసాగిస్తూ తాజాగా నిర్ణయాన్ని తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాలకు (కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి) పార్టీకి సంబంధించిన కొత్త ఇన్ చార్జిలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు తరుణ్ చుగ్ తో పాటు సహాయ ఇన్ చార్జిగా అరవింద్ మీనన్ కు బాధ్యతల్ని అప్పగించింది. పార్టీని వివిధ రాష్ట్రాల్లో మరింత బలోపేతం చేసేందుకు వీలుగా పార్టీ ఇన్ చార్జ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నియమించిన ఇన్ ఛార్జిలు పార్టీని బలోపేతం చేయటంతో పాటు.. రానున్న ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాల్ని తీసుకురావాల్సిన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది.
కొత్తగా ఇన్ చార్జిలుగా ఎంపికైన వారు.. సహ ఇన్ చార్జులు.. ఆయా రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్ని చూస్తే..
తెలంగాణ తరుణ్ చుగ్.. అరవింద్ మీనన్
రాజస్థాన్ అరుణ్ సింగ్.. విజయ రహత్కార్
మధ్యప్రదేశ్ మురళీధర్ రావు.. పంకజా ముండే.. రామ్ శంకర్ కథేరియా
కేరళ ప్రకాష్ జవదేకర్.. డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్
హర్యానా బిప్లబ్ కుమార్ దేబ్
పశ్చిమ బెంగాల్ మంగళ్ పాండే.. అమిత్ మాలవ్యా.. సుశ్రీ ఆశా లక్రా
బిహార్ వినోడ్ తవాడే.. హరీశ్ ద్వివేది
జార్ఖండ్ లక్ష్మీ కాంత్ బాయ్ పాయి
పంజాబ్ విజయ్ భాయ్ రూపానీ.. డాక్టర్ నరీందర్ సింగ్ రైనా
చత్తీస్ గఢ్ ఓం మాధుర్ .. నితిన్ నబీన్
త్రిపుర డాక్టర్ మహేశ్ వర్మ
డయ్యూడామన్ వినోద్ సోంకర్
లక్ష్యదీప్ డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
చండీగఢ్ విజయ్ భాయ్ రూపానీ
ఈశాన్య రాష్ట్రాలకు డాక్టర్ సంబిత్ పాత్రా.. రుతురాజ్ సిన్హా
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.