Begin typing your search above and press return to search.
దీదీ రాజ్యాంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయేమో?
By: Tupaki Desk | 25 Nov 2019 12:43 PM GMTదేశంలో మరే రాష్ట్రంలో అయినా మోడీషాల పప్పులు ఉడుకుతాయేమో కానీ దీదీ రాజ్యమైన పశ్చిమ బెంగాల్ లో మాత్రం సీన్ మరోలా ఉంటుంది. ఈ రాష్ట్రంలోని అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ నేతల తీరుకు కమలనాథులు కిందామీదా పడిపోతుంటారు. దేశంలో ఎక్కడైనా తమ హవా సాగినా.. పశ్చిమబెంగాల్ లో ఎదురయ్యేంత దారుణ పరిస్థితి మరెక్కడా ఎదురుకాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా చోటు చేసుకున్న దారుణ ఘటన గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే. పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వేసిన వీరంగం షాకింగ్ గా మారింది. కరీంపూర్ లో బీజేపీ అభ్యర్థిగా ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా తృణమూల్ అభ్యర్థిగా బిమాలెందు సింఘరాయ్ పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ బయలుదేరారు. ఒక పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. కారు దిగిన ఆయనపై ఊహించని రీతిలో వ్యవహరించారు. కాలితో తన్ని.. పక్కనే ఉన్న గుంతలో నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తనకెదురైన చేదు అనుభవంపై జయప్రకాశ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తుంటే తాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురైందని.. తనపై దారుణంగా దాడి చేశారన్నారు. ఎన్నికల సంఘానికి తాను ఫిర్యాదు చేస్తానని.. పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యం లేదని తాజా ఉదంతంతో రుజువైందన్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో వైరల్ కావటంతో టీఎంసీ రియాక్ట్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ పై దాడికి దిగింది తమ పార్టీ కార్యకర్తలు కాదని.. ఆయనపై కోపంగా ఉన్న స్థానికులని పేర్కొంది. తమ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఎదురైన దారుణ పరాభవంపై మోడీషాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.