Begin typing your search above and press return to search.
బీజేపీకి కొత్త ఇల్లు
By: Tupaki Desk | 10 Aug 2016 12:52 PM GMTబీజేపీ దిగ్గజ నేతలు వాజపాయి, అద్వానీ వంటి హేమాహేమీలు పనిచేసిన ఆఫీసు అది.. ఇప్పుడు ప్లేసు మారిపోతోంది. అవును. ఢిల్లీలోని 11 అశోకా రోడ్‌లో ఉన్న బిజెపి కేంద్ర కార్యాలయాన్ని మరొక చోటికి తరలించనున్నారు. ఇప్పుడున్న ఆఫీస్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ (ఆర్ఎస్ఎస్ నాయకుడు) వీధిలో రెండు ఎకరాల విశాల స్థలంలో పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఎన్నో దశాబ్దాల పాటు బిజెపి ప్రముఖ నేతలు అటల్ బీహారీ వాజ్‌పాయ్, అద్వానీలు…పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన పాత కార్యాలయంలో ఇప్పుడు వారిద్దరి పోస్టర్లకు బదులుగా అమిత్‌షా, మోడీ పోస్టర్లు కనబడుతున్నాయి.
2019 జాతీయ ఎన్నికలకు ముందే ఈ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న నూతన కార్యాలయం నిర్మాణానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. నూతన కార్యాలయం విశాలంగానూ, దేశంలోని ప్రతి బిజెపి పార్టీ కార్యాలయంతోనూ అనుసంధానమై ఉంటుందని, ఏడంతస్తుల ప్రధాన భవనంతో పాటు, మూడంతస్తులతో మరో రెండు భవనాలను నిర్మిస్తారు. పర్యావరణహితంగానూ, అత్యంత ఆధునిక వసతులతోనూ ఈ భవనాలను నిర్మించనున్నారు.
బీజేపీ కొత్త ఆఫీసు మోడీకి తగ్గట్లే అల్ట్రా మోడర్న్ గా ఉండబోతోందట. వైఫై సదుపాయం ఉన్న 70 గదులు, రెండు సమావేశ మందిరాలు, డిజిటల్ లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు అనకూలంగా ప్రొజెక్టర్లు, తెరలు ఉంటాయి. మోడీ రాజకీయ ప్రాభవానికి గుర్తుగా ఈ కార్యాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని... దీనికి సంబంధించి మొత్తం మోడీ ఇష్టాయిష్టాలే ప్రకారమే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.