Begin typing your search above and press return to search.

పాపం కన్నాగారికి భారతీయు విలువలు గుర్తొచ్చాయి

By:  Tupaki Desk   |   22 July 2019 9:35 AM GMT
పాపం కన్నాగారికి భారతీయు విలువలు గుర్తొచ్చాయి
X
హిందుత్వం రెండు రకాలు... సాధారణ హిందుత్వం, రాజకీయ హిందుత్వం. అంతేకదా మరి. తనకు తాను హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ హిందు మతానికి సరికొత్త విలువలను నిర్వచిస్తోంది. మంచి ఎవరు చెప్పినా మంచే గాని... అది రాజకీయ అవసరాలకు తగినట్టు చెప్పడమే అభ్యంతరకరం. బిగ్ బాస్ అనే రియాలిటీ షో దశాబ్దానికి పైగా ఈ దేశంలో రకరకాల భాషల్లో ప్రసారం అవుతోంది. కాన్సెప్ట్ రీత్యా దానికి మంచి టీఆర్పీ కూడా ఉంది.

ఇటీవల ఇద్దరు మహిళా మణులు ఆ షో పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. దీనిపై కాస్త ఆలస్యంగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. అది సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండటం వల్ల, దానిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం వల్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని ఆ షో ను రద్దుచేయమని విన్నవించారు.

కన్నా మాట బానే ఉంది గానీ... పదేళ్లుగా భారతీయ సంప్రదాయాలకు కలగని అభ్యంతరం ఇపుడే ఎందుకు కలిగింది అనేది ప్రాథమిక ప్రశ్న అయితే, దేశ వ్యాప్తంగా ఇవే గొడవలు ఉన్నపుడు, బిగ్ బాస్ మూలం స్టార్ మా గ్రూపు మొత్తం ఉన్నపుడు, అది కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ పరిధిలో ఉన్నపుడు సొంత పార్టీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టొచ్చు కదా కన్నగారు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆ రిక్వెస్టు ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రికి చేస్తే ఫలితం ఉంటుంది కదా, కన్నా గారు అలా చేస్తే బాగుంటుందన్నది జనాంతికంగా వినిపిస్తున్న అభిప్రాయం.

కన్నా ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులకు చాలా సూచనలు చేశారు. ఎవరూ చెవిలోకి వేసుకోలేదు. మరి రిక్వెస్టును మాత్రం ఎలా వేసుకుంటారు, పైగా స్టార్ మా గ్రూపుతో బీజేపీకి మంచి సంబంధాలు ఉండెనాయె. చూద్దాం ఎవరైనా పట్టించుకుంటారేమో.