Begin typing your search above and press return to search.

తెలంగాణ కేంద్రం నిధుల ఫైట్.. ఎవరు ఎవరికిచ్చారు.

By:  Tupaki Desk   |   15 Feb 2020 1:30 PM GMT
తెలంగాణ కేంద్రం నిధుల ఫైట్.. ఎవరు ఎవరికిచ్చారు.
X
తెలంగాణ-కేంద్రం మధ్య పంచాయితీ తెగడం లేదు. తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో లెక్కలు చెప్పి మరీ కడిగేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బులో కేవలం 40శాతం కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వడం లేదని కేటీఆర్ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు.

ఇటీవల పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు గత ఆరు సంవత్సరాలలో 85013 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే కేటీఆర్ చెప్పిన లెక్కలకు , కేంద్రం లెక్కలకు పొంతన లేకుండా పోయింది..

కేటీఆర్ చెప్పిన దాని ప్రకారం 2014-2019 మధ్య కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ2,72,926 కోట్లను పొందింది. కానీ తెలంగాణ కు కేవలం 1,12,854 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చింది. అంటే తెలంగాణ నుంచి తీసుకున్న దానికి ఇచ్చిన దానికి మధ్య వ్యత్యాసం ఏకంగా 1,60,072కోట్లు. ఇన్ని తెలంగాణ నిధులను కేంద్రం వాడేసిందన్నమాట..

అయితే మంత్రి కేటీఆర్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి కే. కృష్ణసాగర్ రావు తాజాగా మాట్లాడారు. కేంద్రం పన్నుల పంపిణీపై కేటీఆర్ వాదన హాస్యాస్పదం గా ఉందని.. రాజకీయంగా అభాసుపాలు చేసేలా ఉందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఏమైనా రాష్ట్రానికి చెందినవి కావు.. అది రాష్ట్ర ఆదాయం కాదని.. కేంద్రానివని.. భారత రాజ్యాంగం ప్రకారం కనీస అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడారని కే. కృష్ణసాగర్ రావు ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 268 నుంచి 293 పార్ట్ 12ను కేటీఆర్ అర్థం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ దేశంలో భాగమని.. ఒక ప్రత్యేక రాష్ట్రం దేశం కాదని హితవు పలికారు.

రక్షణ, ఆహార రాయితీలు, విపత్తు ఉపశమనం, మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను భరించడానికి కేంద్రం రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేస్తుందని.. తెలంగాణ కు రక్షణ వ్యయం ఎవరు భరిస్తున్నారని.. తెలంగాణను రక్షించేది కేంద్రమేనని అన్నారు. మొత్తం నిధులను తిరిగి రాష్ట్ట్రానికి ఇవ్వాలని కేటీఆర్ ఎలా డిమాండ్ చేస్తారని కే. కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. సామాన్యులకు ఏమాత్రం అభివృద్ధి కి తోడ్పడని పథకాలు ఏవీ టీఆర్ఎస్ కల్పించలేదని.. కేంద్రం నిధులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.