Begin typing your search above and press return to search.
మోడీ, అమిత్ షాలకు షాకిచ్చిన.. బీజేపీ సీఎం.. తమిళ నేతల సంబరాలు
By: Tupaki Desk | 29 April 2022 3:57 AM GMTకర్ణాటక రాష్ట్రం కేంద్రంగా వెలుగు చూసిన భాషా పరమైన వివాదం.. దేశవ్యాప్తంగా సెగలు పుట్టిస్తుంటే.. తమిళనాడులో మాత్రం.. నాయకులకు పండగ వాతవారణం కల్పించింది. ! ఆశ్చర్యంగా ఉన్నప్పటి ఇది నిజం. తమిళనాడు వాసులు.. నాయకులు ప్రాంతీయ భాషకే ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఎక్కడా.. హిందీకి అసలు పెద్ద వాల్యూ ఇవ్వరు. అయితే.. ఇటీవల కాలంలో కేంద్ర హోం మంత్రి, ప్రధాని మోడీలు.. హిందీని దేశంలో ప్రధాన భాషగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని..తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నామధ్య తమిళనాడులో పర్యటించిన అమిత్‌షా ... హిందీపైనే ఎక్కువగా వ్యాఖ్యలు చేశారు. అంతేకా దు.. హిందీని నేర్చుకుని తీరాల్సిందేనని పట్టుబట్టారు. దీనిని తమిళనాడు సీఎం సహా.. అనేక మంది నా యకులు.. తిప్పికొట్టారు. ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాతృభాషే ముఖ్యమని అన్నారు. అయితే.. ఈ వివాదం ఇంకా ముగిసిపోలేదు. కానీ, బీజేపీ నాయకులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని నాయకులు.. ఈ విషయంలో నోరు విప్పి మాట్లాడేందుకు సాహసించలేదు.
ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రాంతీయ భాషలకు ఉన్న వాల్యూ అలాంటిది. దీంతో అమిత్ షా చెప్పినా.. ప్రధానే చెప్పినా.. ఈ నేతలు.. హిందీని వద్దని చెప్పలేదు.. కావాలని కూడా చెప్పలేదు. తటస్థంగా వ్యవహరించారు.
అయితే.. తాజాగా కర్ణాటక సీఎం.. బసవరాజ్ బొమ్మయ్ ప్రాంతీయ భాషల వల్లే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఉందని నొక్కి చెప్పారు. అంతేకాదు... కన్నడ నటుడు.. హిందీపై చేసిన సంచలన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్ధించారు.
సుదీప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నారు. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అందువల్ల ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ప్రతి ఒక్కరూ సుదీప్ చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలని, గౌరవించాలని సీఎం చెప్పారు. ఇదే.. ఇప్పుడు.. తమిళనాడు నేతలకు వరంగా మారింది.
నిన్న మొన్నటివరకు హిందీ వద్దన్న తమపై నిప్పులు చెరిగిన.. అమిత్‌షా.. మోడీలు.. ఇప్పుడు మీ సొంత పార్టీ బీజేపీ సీఎం.. బొమ్మైనే.. హిందీ వద్దు.. లోకల్ ముద్దు.. అని కామెంట్లు చేస్తున్నారని.. దీనిని బట్టి.. మీ సిద్ధాంతాలు మీ దగ్గరే దాచుకోండి! అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సుదీప్ చేసిన ట్వీట్, వ్యాఖ్యలు.. అటు సినీ వర్గాల్లోనే కాకుండా.. కేంద్రానికి కూడా పాకడం.. గమనార్హం.