Begin typing your search above and press return to search.
ఇంతమాత్రానికి ఏడుగురు మంత్రులు అవసరమా?
By: Tupaki Desk | 12 Nov 2015 5:37 AM GMTలాజిక్ పెద్ద పట్టించుకోకుండా.. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేసే ఏ అవకాశాన్నీ వదులుకోరు రాజకీయ నాయకులు. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చిన్న ఛాన్స్ చిక్కినా చెలరేగిపోతారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఇదే తీరులో టార్గెట్ చేస్తోంది బీజేపీ. వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకూడదని.. విజయం ఖాయమైనా.. మెజార్టీ విషయంలో మరింత బాగా ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్న తెలంగాణ అధికారపక్షం వరంగల్ ఉప ఎన్నిక కోసం ఏడుగురు మంత్రుల్ని నియమించింది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రికి బాధ్యత అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గతం కంటే మిన్నగా ఓట్లు పార్టీకి పడాలన్న లక్ష్యంతో మంత్రులు పని చేయాలని.. తాను కోరుకున్న ఫలితాన్ని వచ్చేలా శ్రమించాలని ఆయన టార్గెట్ పెట్టి మరీ పంపారు. ఇదిలా ఉంటే.. వరంగల్ ఉప ఎన్నిక విషయంలో మంత్రుల నియామకంపై బీజేపీ వాదన వేరుగా ఉంది.
కేసీఆర్ కానీ సరిగా పాలిస్తుంటే.. ఒక ఉప ఎన్నిక కోసం ఏడుగురు మంత్రుల్ని పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పరిపాలన సరిగా చేసి ఉంటే ఇంతమంది మంత్రులు ప్రచారం చేయాల్సి ఉండేది కాదని లాజిక్ తీస్తున్నారు వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగి.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దేవయ్య. ఒక ఉప ఎన్నిక కోసం ఇంతమంది మంత్రులు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్క మంత్రి కానీ.. ఒక ఎమ్మెల్యే కానీ పరామర్శించిన పాపాన పోలేదని.. రైతుల్ని ఆదుకోవటంలో పూర్తిస్థాయిలో తెలంగాణ సర్కారు విఫలమైందని తీవ్రంగా మండిపడ్డారు. వృత్తిపరంగా డాక్టరే అయినా.. దేవయ్య రాజకీయాలు త్వరగానే వంటబట్టాయే.