Begin typing your search above and press return to search.
బీజేపీ ఫ్రస్టేషన్.. రాహుల్ పై పాత స్టయిల్లో విమర్శలు
By: Tupaki Desk | 17 Dec 2018 10:31 AM GMTఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మామూలు షాకులు తగల్లేదు. మూడు చోట్ల ఆ పార్టీ అధికారం కోల్పోయింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ దారుణమైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇంకో ఆరు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న ఆందోళన మొదలై పోయింది ఆ పార్టీలో. మొన్నటిదాకా తక్కువగా అంచనా వేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు సత్తా చాటుకున్నాడు. ఇక పై అతడిని తక్కువ గా అంచనా వేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ ను ఉద్దేశించి పాత స్టయిల్లో విమర్శలు చేయడం మొదలుపెట్టారు భాజపా నేతలు.
ఒకప్పుడు సోనియా గాంధీ జాతీయతను ప్రశ్నిస్తూ.. ఆమెను.. రాహుల్ గాంధీ ని విమర్శించేవాళ్లు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచినపుడు విదేశీయురాలైన సోనియా ప్రధాని పదవి చేపట్టడానికి వీల్లేదంటూ భాజపా పెద్ద గొడవే చేసింది. ఆ తర్వాతి కాలంలో కూడా అవకాశం వచ్చినపుడల్లా సోనియా.. రాహుల్ జాతీయతను ప్రశ్నించేవాళ్లు. ఐతే గత ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఈ ఒరవడి తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పాత స్టయిల్లో విమర్శలు చేస్తున్నారు రాహుల్ మీద. ఒక విదేశీయురాలి కి పుట్టిన వ్యక్తి దేశం పట్ల నిజమైన దేశభక్తిని ప్రదర్శిస్తాడని అనుకోలేమంటూ భాజపా నేత కైలాష్ విజయ వర్గీయ విమర్శించాడు.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించింది కైలాషే. అక్కడ భాజపా కు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అసహనంతోనే అతను రాహుల్ మీద విమర్శలు చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ ఇలాంటి విమర్శలు మేలు కంటే చేటే చేస్తాయి. సోనియా విదేశీయతనే జనాలు మరిచిపోయారు. అలాంటిది రాహుల్ గురించి ఇప్పుడు ఈ రకమైన విమర్శలు చేయడం దిగజారుడుతనంలాగే అనిపిస్తుంది జనాలకు. కాబట్టి ఇలాంటి బూమరాంగ్ విమర్శలకు దూరంగా ఉండటం బెటర్.