Begin typing your search above and press return to search.
తెలంగాణ కోసం ప్లాన్ `బీ`తో వస్తున్న బీజేపీ
By: Tupaki Desk | 21 Oct 2017 9:58 AM GMTతెలంగాణలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇందుకు తగిన ప్రణాళికలను అమలు చేయడంలో వేగం పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారీగా సీట్లు సాధించాలని - అవకాశం దొరికితే అధికారాన్ని కైవసం చేసుకోవాలని రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం ఇప్పటికే రకరకాల స్కెచ్ లు వేస్తున్న కమలం పార్టీ.. తాజాగా మరో ప్లాన్ ను రెడీ చేసింది.అదే తెలంగాణలో బలపడడం కోసం.. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం. కొత్త ప్రణాళికను పక్కాగా అమలు చేస్తే.. తెలంగాణ గడ్డపైనా.. ప్రత్యేకించి హైదరాబాద్ లో పట్టుబిగించడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. తమ ప్లాన్ బీ ఫలించే అవకాశాలు ఎక్కువ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ గత ఎన్నికల్లో హైదరాబాద్ లో బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా తెలంగాణలో 15 సీట్లలో గెలిచింది. ఇందులోనూ 10 స్థానాలు హైదరాబాద్ లోవే. కానీ.. టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి వెళ్లిపోవడంతో.. ఆ స్థానాలపై బీజేపీ కన్నేసింది. అందుకే.. హైదరాబాద్ లో వరుసగా కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావును బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా చేయడంతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కార్యకర్తల సమావేశం - పాతబస్తీపై దృష్టి పెట్టి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బహిరంగ సభను నిర్వహించింది. మరోవైపు ఈ సారి ఒంటరిపోరే అంటూ చెబుతున్న బీజేపీ... సికింద్రాబాద్ - హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో మరింత బలపడడం ఎలా అన్న దానిపై మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ బలాబలాలను ఈ సమావేశాల్లో సమీక్షిస్తున్నారు.
ఇలా గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమళనాథులు.... కాస్త కష్టపడితే ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. అవకాశం దొరికితే త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా.. బీజేపీ క్యాడర్ లో మరింత జోష్ నింపాలనుకొంటున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ కు పోటీ ఇచ్చే స్థాయికి చేరేందుకు హైదరాబాద్ ను వేదికగా చేసుకుంటామని చెప్తున్నారు.