Begin typing your search above and press return to search.
మోడీ రాష్ట్ర ఎమ్మెల్యేలు తన్నుకున్నారు
By: Tupaki Desk | 23 Feb 2017 10:32 AM GMTచట్టసభల్లో ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై మరోమారు ప్రజల్లో చులకన భావం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొన్నటికి మొన్న డీఎంకే ఎమ్మెల్యేలు చేసిన హంగామాను మరచిపోక ముందే...అలాంటి మరొక ఘటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార - ప్రతిపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడంతో సభ రణరంగమైంది. ఈ గొడవలో ముగ్గురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - సహాయ మంత్రి కూడా అయిన బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
అమ్రేలి జిల్లాలో రైతు ఆత్మహత్యలకు కారణం ఏంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధన్నాని ప్రశ్నించడంతో ఈ గొడవ మొదలైంది. ఈ ప్రశ్న ఇరు పక్షాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. అది కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది. రెండు పార్టీల సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రత్యర్థులపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో స్పీకర్ రమణ్ లాల్ వోరా సభను కాసేపు వాయిదా వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు. అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సభ మళ్లీ మొదలైన తర్వాత ఈ గొడవకు కారణమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ దాడిలో గాయపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్దేవ్ జీ ఠాకూర్.. తాను బీజేపీ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టంచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/