Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్‌ ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   5 Jan 2021 10:48 AM GMT
ప్రగతి భవన్‌ ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు .. ఎందుకంటే ?
X
ప్రగతి భవన్ వద్ద ఉద్రికత్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. ఈ మద్యే జరిగిన జిహెచ్ ఎంసి ఎన్నికల్లో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో నిరసన తెలియజేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనతో పోలీసులకి , కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చేలరేగింది. నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలనీ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు తమను ఎన్నుకుంటే , ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచామన్నారు. ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి అంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు , మేము ఎమన్నా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు పోలీసుల్ని ప్రశ్నించారు. కెసిఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో సమావేశం నిర్వహించారు. అయితే , ఇప్పటివరకు టీఆర్ఎస్‌గా గెలిచిన కార్పొరేటర్లు సైతం ప్రమాణ స్వీకారం చేయలేదు. అలాగే , కొత్త మేయర్ కూడా ఎన్నిక ఇంతవరకు జరగలేదు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.